18 పేజెస్ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది

నిఖిల్ – అనుపమ జంటగా నటించిన 18 పేజెస్ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది. కుమారి 21 ఫేమ్ ప్రతాప్ తెరకెక్కించిన ప్రేమ కథ చిత్రం 18 పేజెస్. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుండి వచ్చిన సినిమా కావడం..ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది. డిసెంబర్ 23 న విడుదలై చక్కటి విజయం సాధించిన ఈ మూవీ..జనవరి 27 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు ఆహా అధికారిక ప్రకటన చేసింది.

‘ సుకుమార్‌ రైటింగ్స్ అంటేనే ఓ మ్యాజిక్‌.. ఆ కలం నుంచి వచ్చిన ఒక థ్రిల్లింగ్‌, టచింగ్ బ్లాక్ బస్టర్ 18 పేజెస్‌.. చదవడానికి అందుబాటులో.. సారీ జనవరి 27 నుంచి వీక్షించండి’ అంటూ ఆహా టీం స్పెషల్ వీడియోను షేర్ చేసింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2-సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై బన్నీవాసు నిర్మించారు. 18 పేజెస్‌కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథనందించారు.