విజయ్ తో ట్రిప్ కి వెళ్తే తప్పేంటి అంటున్న రష్మిక

రష్మిక – విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని గత కొంతకాలంగా వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. వీరి రిలేషన్ షిప్ ఫై ఇద్దరు ఇంతవరకు నోరు విప్పకపోయిన తాజాగా రష్మిక మాత్రం మీడియా అడిగిన ప్రశ్నకు కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యింది. గీత గోవిందం మూవీ తో యూత్ ను ఫామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసింది రష్మిక..ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ గా మారింది.

పుష్ప మూవీ తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సాధించి , తెలుగు, హిందీ , తమిళ్ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక ఆమె హిందీలో నటించిన రెండో సినిమా మిషన్ మజ్ను రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా డైరెక్ట్ ఒటీటీలో రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు గత కొంతకాలంగా విజయ్ దేవరకొండతో డేట్ లో ఉండనే రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం మాల్దీవులు కూడా వెళ్ళారు. అయితే మాల్దీవుల ఫోటోలపై ఆమె ఆసక్తికరంగా స్పందించింది. విజయ్ తన ఫ్రెండ్ అని అతనితో ట్రిప్ కి వెళ్తే తప్పేంటి అని తిరిగి ప్రశ్నించింది. ఇప్పుడు ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.