ఏపీలో పరీక్షల నిర్వహణకు మూడు వారాల సమయం ఉంది
విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

Amaravati: ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు జరిగాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మే నెలాఖరు వరకూ విద్యార్థులకు సెలువులు ఇచ్చామని, జూన్ 1 నుండి ఉపాధ్యాయులను పాఠశాలకు రావలసిందిగా చెప్పామని అన్నారు. అన్ని విషయాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. పరీక్షల నిర్వహణకు ఇంకా మూడు వారాల సమయం ఉందని, టెన్త్ లో గ్రేడింగ్ లేకపోతే విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తామని , ఇతర రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/