ఈరోజు 17 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు : దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్: నిర్వహణ సమస్యల వల్ల పలు ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మొత్తం 17 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. లింగంపల్లి – హైదరాబాద్ మార్ంలో 2 సర్వీసులు, హైదరాబాద్ – లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి – ఫలక్‌నూమా మార్గంలో 6 సర్వీసులు, ఫలక్‌నూమా – రామచంద్రాపురం మార్గంలో ఒక్క సర్వీసు, ఫలక్‌నుమా – హైదరాబాద్ మార్గంలో ఒక్క సర్వీసును రద్దు చేశారు. రెగ్యులర్‌గా ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.