తెలంగాణలో వెయ్యి దాటిన కరోనా కేసులు..10 ఓమిక్రాన్ కేసులు

corona virus-india

తెలంగాణ లో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల ఎఫెక్ట్ కరోనా కేసులు పెరగడానికి కారణమయ్యాయని తెలుస్తుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం చాలామంది బయట ప్రాంతాలకు వెళ్లారు. వారి కారణంగా ఓమిక్రాన్ కేసులతో పాటు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ చెపుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1052 క‌రోనా కేసులు , 10 ఓమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.

గ‌త కొద్ది నెల‌ల నుంచి ఒక్క రోజులో న‌మోదు అయిన కేసుల‌లో ఇదే అత్య‌ధికం. సోమవారం తో పోల్చుకుంటే ఈరోజు దాదాపు 100 శాతానికి పై గా కేసులు పెరిగడం రాష్ట్రంలో కరోనా డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయని తెలుస్తుంది. ఇక కరోనా బారిన పడి మరో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 240 బాధితులు వైరస్‌ను జయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,858 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 42,991 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 08 నుండి రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. ప్రతి ఒక్కరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని వైద్యారోగ్య శాఖ కోరుతోంది.