జూన్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్..?

కరోనా , ఓమిక్రాన్ వైరస్ కేసులు ఎక్కువ కాకపోతే రేపు ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అలాంటిది కరోనా కేసుల మూలానా జూన్ కు వెళ్లాల్సి వస్తుంది. అవును ప్రస్తుత పరిస్థితులు బట్టి సినిమాను జూన్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన మూవీ ఆర్ఆర్ఆర్. చ‌రిత్ర‌లో క‌లుసుకోని ఇద్ద‌రు యోధులు క‌లుసుకుని బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నే ఊహాత్మ‌క క‌థాంశంతో రాజ‌మౌళి క‌థ‌ను త‌యారు చేసి సినిమాను రూపొందించారు. దాదాపు రూ.600 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో డివివి ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కొముంర భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. ఇంకా బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌.. హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిసన్ డూడి త‌దిత‌రులు న‌టించారు. పాన్ ఇండియా గా పలు భాషల్లో ఈ మూవీ ని జనవరి 07 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. దానికి తగ్గట్లే భారీ ఎత్తున ప్రమోషన్ చేసారు. అంత సెట్ అయ్యిందని అనుకునేలోపే కరోనా కేసులు పెరగడం తో పలు రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు మొదలుపెట్టారు.

దీంతో సినిమా థియేటర్స్ మూతపడడం , రాత్రి కర్ఫ్యూ లు ఉండడం తో సినిమాను చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఈ క్రమంలో ఈ సినిమాను మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డి థియేట‌ర్స్ తెరుచుకున్న త‌ర్వాతే ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల‌వుతుంద‌నేది టాక్‌. అయితే బ‌య‌ట‌కు చెప్ప‌లేదు కానీ.. రాజ‌మౌళి అంట్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. జూన్ నాటికీ కరోనా అంత కంట్రోల్ అయ్యి మళ్లీ మాములు పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్పుడే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారట. నిజంగా అప్పుడే చేస్తారా..ఈ లోపు కరోనా కంట్రోల్ అయితే ఈ మధ్యనే చేస్తారా అనేది చూడాలి.