భారీ విరాళం ప్రకటించిన బిర్లా గ్రూప్‌

birla group
birla group

ముంబయి: భారత్‌లో కరోనా కట్టడికి భారి ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఇప్పటికే రిలయన్స్‌, విప్రో, టాటా వంటి కంపెనీలు భారీగా విరాళాలను ప్రకటించిన విషయం తెలిసందే. అయితే తాజాగా ఇందులో బిర్లా గ్రూప్‌ కూడా చేరింది. తాజాగా బిర్లా గ్రూప్‌ కరోనా నివారణకు రూ.500 కోట్లు విరాళంగా ప్రకటించింది. ఇందులో రూ. 400 కోట్లు పీఎం కేర్స్‌ ఫండ్‌ కు, రూ. 50 కోట్లు కరోనా సహయక చర్యలకు, మరో 50 కోట్లు వైద్య సిబ్బంది రక్షణ దుస్తులకు, వెంటిలెటర్లు, మాస్కుల కోసం అందిస్తున్నట్లు బిర్లా గ్రూప్‌ ప్రకటించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిం: https://www.vaartha.com/telangana/