ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ అరెస్ట్

కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్లు కొడుకు వ‌న‌మా రాఘ‌వ ను పోలీసులు అరెస్ట్‌ చేసారు. పాల్వంచలో రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న వ‌న‌మా రాఘ‌వ ను..పోలీసులకు అప్పగించారు వ‌న‌మా వెంకటేశ్వర్లు. రాఘ‌వ‌ను హైద‌రాబాద్‌కు వ‌చ్చి.. కొత్త‌గూడెం పోలీసులు తీసుకెళ్లారు. ప్రస్తుతం వ‌న‌మా రాఘ‌వ ఫై 302, 306, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఈరోజు ఉదయం నుంచి పోలీసులతో టచ్ లో ఉన్న ఎమ్యెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్లు.. తన కొడుకు రాఘవను పోలీసులకు అప్పగించారు. అయితే.. మీడియాతో మాట్లాడిన తర్వాత.. నన్ను అరెస్ట్ చేయాలని వనమా రాఘవ కోరగా.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా పోలీసులు అరెస్ట్ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణం రాఘవే అని..రామకృష్ణ ఆత్మ హత్య కు ముందు సెల్ఫీ వీడియో తీసుకొని చెప్పడం జరిగింది. ఈ వీడియో లో రామకృష్ణ సంచలన విషయాలు బయటపెట్టారు.

‘‘రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. వనమా రాఘవ దురాగతాలతో ప్రజలు ఎలా బతకాలి. అతని లాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. కానీ ఏ భర్త కూడా వినగూడని మాట వనమా రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని అడిగారు. రాజకీయ, ఆర్ధిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు.నేను ఒక్కడినే చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు నా భార్యాపిల్లల్ని తీసుకెళ్తున్నాను. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు. నేను వీళ్లందరితో పోరాటం చేసే స్థితిలో లేను. నా తండ్రి ద్వారా వచ్చే ఆస్తితో నా అప్పులు తీర్చాలి. నాకు సహకారం అందించిన అందరికీ న్యాయం చేయాలి.” అని అన్నారు.