అవతార్ 2 కు బాగా కలిసొచ్చిన క్రిస్మస్

యావత్ సినీ లవర్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన అవతార్ 2 మూవీ డిసెంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి అవతార్‌ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవతార్‌ సినిమా ఏ రేంజ్‌లో రికార్డులు సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కొత్త లోకంలో విహరింపజేసిన అవతార్‌ సినిమా సీక్వెల్స్‌తో మరోమారు ప్రేక్షకులను అలరించింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికన్, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. ముఖ్యంగా 10 రోజులకు కలిపి ఈ సినిమా ఒక బిలియన్ మార్క్ కి దగ్గరగా వచ్చేసింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 8000 కోట్ల రూపాయలు అన్నమాట. నిన్న ఆదివారం క్రిస్మస్ అవతార్ 2 బాగా కలిసొచ్చింది.

ఇక తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూస్తే..నైజాం లో 10 రోజుల్లోనే 35 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఏపీలో రూ. 22 కోట్లు, సీడెడ్ లో రూ. 7 కోట్ల 20 లక్షల రూపాయల వసూలు చేసింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 64 కోట్ల రూపాయలు గ్రాస్ వచ్చినట్లు సమాచారం. నార్త్ ఇండియాలో రూ.140 కోట్లు .. తమిళనాడులో రూ. 40 కోట్లు.. కర్ణాటకలో రూ.39 కోట్లు.. కేరళలో రూ. 29 కోట్ల రూపాయలు వచ్చాయని సమాచారం. మొత్తం మీద ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు అయినట్టు తెలుస్తుంది.