సీఎస్ సోమేష్ కుమార్ కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు

big shock to somesh kumar

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు బిగ్‌ షాక్‌ ఇచ్చింది హైకోర్టు. రాష్ట్రంలో సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. అలాగే సోమేశ్ కుమార్ సొంత రాష్ట్రమైన ఏపీకి వెళ్లాలని హైకోర్టు సూచించింది. గతంలో క్యాబ్ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. న్యాయవాది అభ్యర్ధనతో కోర్టు తీర్పు 3 వారాల పాటు నిలిపివేశారు. దీనిపై సీఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించింది కేంద్రం. అయితే, కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఇప్పుడు సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది.సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేస్తూ ..ఏపికి వెళ్లాలని ఆదేశించింది.