డైరెక్టర్ వర్మ ను చెప్పుతో కొడతాం.. అంటూ కాపు సంఘాల హెచ్చరిక

డైరెక్టర్ వర్మను చెప్పుతో కొడతామంటూ కాపు సంఘాల నేతల హెచ్చరించారు. ఆదివారం జనసేన నేత పవన్ కళ్యాణ్ – చంద్రబాబు సమావేశం కావడం తో ఏపీలో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. రాబోయే ఎన్నికల్లో టిడిపి – జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయనే ప్రచారానికి మరింత ఊపు తెచ్చింది వీరిద్దరి సమావేశం. ఈ సమావేశం అనంతరం వైస్సార్సీపీ నేతలు వరుసపెట్టి విమర్శలు చేస్తుండగా..డైరెక్టర్ వర్మ సైతం తన ట్విట్టర్ లో కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని తాను ఊహించలేదని అన్నారు. ‘RIP కాపులు , కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఫై కాపులు నేతలు వర్మ ఫై ఆగ్రహం తో ఊగిపోతున్నారు.

వర్మ ట్వీట్ వెనుక వైస్సార్సీపీ హస్తం ఉందని ఆరోపించారు. కాపు మంత్రులంతా.. జాతిని ముఖ్యమంత్రి జగన్‌కు తాకట్టు పెట్టారని.. కాపులపై కుట్రలో భాగంగానే రామ్‌గోపాల్‌వర్మ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. వర్మ ప్యాకేజీ కోసం కాపులపై కామెంట్లు చేస్తే చెప్పు తీసుకుని కొడతామని హెచ్చరించారు. కాపులను రాజకీయ కారణాలు పేరు చెప్పి విభజించాలనే కుట్ర జరుగుతుందన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టాలని వైస్సార్సీపీ నేతలు వర్మ లాంటి ఊర కుక్కలను వదలుతున్నారు. గత ఎన్నికలలో జగన్ కాపుల కోసం అనేక హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. కాపు జాతి గురించి ప్రేమ ఉంటే జగన్‌ను నిలదీయాలన్నారు. వైస్సార్సీపీ లో ఉన్న కాపు నేతలు నోళ్లు అదుపులో పెట్టుకోవాలన్నారు. కాపు జాతి గురించి మాట్లాడే వారు కాపులకు ఏమైనా చేశారా అంటూ ప్రశ్నించారు.