వకీల్ సాబ్ కలెక్షన్లు బ్రేక్ చేసిన అఖండ

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. మరోసారి బోయపాటి – బాలయ్య కాంబో బ్లాక్ బస్టర్ కాంబో అని నిరూపించింది. ఈ మూవీ టాక్ పరంగానే కాక కలెక్షన్ల పరంగా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. తాజాగా అందుకున్న సమాచారం మేరకు ఈ మూవీ కేవలం నాల్గు రోజుల్లోనే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కలెక్షన్ల ను బ్రేక్ చేసిందని తెలుస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ బాలయ్య కు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ‘అఖండ’కు అక్కడ భారీ స్పందన వస్తోంది. ఇప్పటి వరకూ ఈ చిత్రం అక్కడ ఓ రేంజ్‌లో కలెక్షన్లను అందుకుంది. దీంతో కేవలం నాలుగు రోజుల్లోనే 800K డాలర్లను వసూలు చేసింది. ఫలితంగా వకీల్ సాబ్ (743K) దాటింది. అలాగే, బ్రేక్ ఈవెన్‌ను కూడా మూడో రోజే దాటేసింది. నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.31 కోట్లు రాబట్టింది. దీంతో 4వ రోజు ఎక్కువ వసూలు చేసిన (నాన్ బాహుబలి) ఐదో చిత్రంగా నిలిచింది. దీనికి ముందు ‘అల.. వైకుంఠపురములో’, ‘సాహో’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘మహర్షి’ చిత్రాలు ఉన్నాయి.

ఇక నాల్గు రోజుల్లో తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 12.11 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.81 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.74 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.61 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.04 కోట్లు, గుంటూరులో రూ. 3.26 కోట్లు, కృష్ణాలో రూ. 2.28 కోట్లు, నెల్లూరులో రూ. 1.71 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 37.56 కోట్లు షేర్, రూ. 59.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.