మీడియా ముందుకు కరాటే కళ్యాణి..

నిన్నటి నుండి కరాటే కల్యాణి..ఎక్కడ ఎక్కడ అని కుటుంబ సభ్యులు , పోలీసులు , మీడియా వారు తెగ వెతుకుతూ వచ్చారు. ఇటీవలే యూట్యూబర్​ శ్రీకాంత్​రెడ్డి – కరాటే కళ్యాణి మధ్య వివాదం హాట్​టాపిక్​గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఎస్సార్​నగర్​పోలీస్​స్టేషన్​లో ఒకరిపై మరొకరు ఇద్దరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇది మీడియా లో వైరల్ అవుతుండగానే..కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్‌ లేబర్ అధికారులు సోదాలు నిర్వహించడం మీడియా లో మరింత వైరల్ గా మారింది. కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారిని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు రావడం తో అధికారులు నిన్న సోదాలు చేపట్టారు. అయితే కళ్యాణి నిన్నటి నుండి కనిపించకుండా పోవడం, ఫోన్ కూడా స్విచ్ అఫ్ అవ్వడం ఫై ఆమె ఎక్కడికి వెళ్లింది..ఎవరైనా కిడ్నాప్ చేసారా..అనే అనుమానాలు రేకెత్తించాయి.

ఈ తరుణంలో సోమవారం సాయంత్రం మీడియా ముందుకు కళ్యాణి వచ్చింది. తాను పారిపోయే రకం కాదని,ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేసింది. తాను పిల్లలను అమ్ముకోవడం ఎవరైనా చూశారా? అని, ఒంటరి మహిళ అంటే అంతా చులకనా? అంటూ పైర్‌ అయ్యింది. తన ఇంట్లోనే ఉన్నామని, స్టింగ్‌ ఆపరేషన్‌ చేసుకోండి ఆమె వ్యాఖ్యానించింది. ఈ వివాదం వెనక పెద్ద శక్తులు పనిచేసాయని అనుమానం వ్యక్తం చేశారు. తనకు మనసుందని.. ఆడపిల్లలంటే తనకు ఇష్టముండడంతోనే పాపను పెంచుకుంటున్నానని.. పాపతో పాటు చిన్నారి తల్లిదండ్రులు కూడా తనతో పాటు ఉంటున్నారని.. ఇకపై కూడా నాతో అందరూ కలిసే ఉంటారని.. ఏడాది తర్వాతే అధికారికంగా దత్తత తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.