టీడీపీ తో టచ్ లో ఉన్న వైస్సార్సీపీ నేతలు..

ఎన్నికల సమయం ఇంకా ఉన్నప్పటికీ ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైస్సార్సీపీ – టీడీపీ ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతున్నాయి. వేదికలపైనే కాదు సోషల్ మీడియా వేదిక ఫై కూడా మాటల తూటాలు వదులుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చేసిన ట్వీట్ వైస్సార్సీపీ లో టెన్షన్ ను నింపింది. కొంతమంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లో ఉన్నారంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు.

‘కేవలం నెల్లూరులోనే ముగ్గురు ఎమ్మెల్యేలు,ఒక ఎంపీ మాతో టచ్‌లో ఉన్నారు. అందులో రోజూ నీతో మాట్లాడే ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ప్రతి రోజు నిన్ను,నీ పార్టీని బహిరంగంగా బూతులు తిట్టే ఇంకో ఎమ్మెల్యే ఉన్నారు. దమ్ముంటే నువ్వు, మీ జగన్ రెడ్డి గారికి చెప్పి సస్పెండ్ చేయించు అ’నిల్లు’’అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్‌ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం శ్రీనివాసులు చేసిన ట్వీట్ గురించి అంత మాట్లాడుకుంటున్నారు.

కేవలం నెల్లూరులోనే ముగ్గురు ఎమ్మెల్యేలు,ఒక ఎంపీ మాతో టచ్ లో ఉన్నారు.అందులో రోజునీతో మాట్లాడే ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ప్రతి రోజు నిన్ను,నీ పార్టీని బహిరంగంగా బూతులు తిట్టే ఇంకో ఎమ్మెల్యే ఉన్నారు.దమ్ముంటే నువ్వు,మీ జగన్ రెడ్డి గారికి చెప్పి సస్పెండ్ చేయించు అ’నిల్లు’.@AKYOnline— Kalava Srinivasulu (@KalavaTDP) May 16, 2022