భారత్‌, చైనా రక్షణ సంబంధాలు

india- china
india- china


భా రత్‌, చైనా రక్షణ సంబంధాలపై ఉన్నతస్థాయి కమిటీ డిసెంబరు మొదటివారంలో సమావేశమై చర్యలు జరిపాయి. ఇండియా మెతకవైఖరితో సరిహద్దు దేశమైన చైనా ప్రతిసారి సరిహద్దుల్లో ఉల్లంఘనలకు పాల్పడుతూ ఇండియా భూభాగంలో చొరబాట్లకు పాల్పడుతుందనేది నిత్యసత్యం. చైనా ఇండియాకు వ్యతిరేకంగా తన సైన్యాన్ని పెద్దస్థాయిలో భారత సరిహద్దుల్లో మోహరిస్తుంది. భారత్‌లోని లడఖ్‌ ప్రాంతంలోని సరిహద్దులో చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన మిలిటరీని మోహరించినట్లు రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు. చైనా పి.ఎల్‌ సైనికులు ఆ ప్రాంతంలో టెంట్‌లు వేసి సొరంగాలను నిర్మిస్తు న్నారు. చైనా, ఇండియా రక్షణ మంత్రిత్వశాఖల మధ్య చర్చలలో హిమాలయ ప్రాంత కారిడార్‌ గూర్చి, టిబెట్‌ సరిహద్దుల్లో, డొక్లా మ్‌ ప్రాంతంలో నిర్మాణాలను గూర్చి చర్చకు వచ్చాయి. ఈ సంద ర్భంగా రెండు దేశాల రక్షణశాఖాధికారులు వారిస్థాయిలో ఇరువైపు ల రక్షణను ఉల్లంఘించడం జరగదని ఒప్పందం చేసుకున్నారు. అయినా చైనా పిఎల్‌ ఆర్మీ మాత్రం ఇండియా సరిహద్దులలో రోడ్లు, టన్నల్స్‌ చేపట్టడం వల్ల ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఇప్ప టికే చైనా ఇండియాపై పాకిస్థాన్‌ను, వారి దేశంలో ఉన్న ఉగ్ర వాదులకు సహాయాన్ని అందించి ఇండియాలోని కాశ్మీరు సరి హద్దులు, పాకిస్థాన్‌ ఆక్రమిత ప్రాంతం పిఒకె నుండి కాశ్మీరుపై చొరబాట్ల దాడులు జరుపుతూనే ఉన్నాయి. అంతేగాక ఇండియా, నేపాల్‌ సరిహద్దు ప్రాంతమైన డొక్లామ్‌లో రోడ్డు నిర్మాణం జరిపి ఇండియాను కవ్విస్తూనే ఉంది. అదేవిధంగా ఇండియాలోని బ్రహ్మ పుత్ర నదిపైభాగాన విద్చుచ్ఛక్తి ప్రాజెక్టులు నిర్మించి ఆ నదికి నీరు రాకుండా చేస్తుంది. భారతదేశ ప్రయోజనాలను హరించే విధంగా చైనా పనిచేస్తూనే ఉంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇండియా రక్షణ మంత్రి కానీ, మంత్రులు కానీ సందర్శించడాన్ని చైనా వ్యతిరేకి స్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌ అంతదట్టమైన అడవ్ఞలు, పర్వతాలతో నిండి ఉంది. విలువైన ఖనిజసంపదకు నెలవై ఉంది. దానిపై చైనా కన్నేసి అరుణాచల్‌ప్రదేశ్‌ మాదేనని అప్పుడప్పుడు ప్రకట నలు చేస్తూనే ఉంది. అంతేగాక అరుణాచల్‌ప్రదేశ్‌లో జలవిద్యుత్‌ ప్రాజెక్టులున్నాయి. ఇటీవల యురేనియం నిల్వలను కనుగొనబడి ఇండియా యూరేనియం కార్పొరేషన్‌ ఆప్రాంతంలో తవ్వకాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో చైనా అరుణాచల్‌ప్రదేశ్‌కు ఆవల లక్షల మంది చైనీయులు భూమిలేక సరస్సులలో నదిపరీవాహక ప్రాంతాలలో ఇళ్లు కట్టుకొని నీటిలో జీవనం సాగిస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర జనాభా అంతా 14 లక్షలే. ఒక చIIకిII మీటరు 102 మందే ఉంటారు. కనుక ఆ భూభాగాన్ని ఆక్ర మించుకొని చైనా ప్రజలకు నివాసం ఏర్పరచాలని 1998 నుండి ప్రయత్నాలు సాగిస్తుంటే ఇండియా వారిని తిప్పికొడుతుంది. అంతేగాక అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రజల అభివృద్ధి విద్య,వైద్యం, పాఠ శాలలు స్థాపించి వారిని సంతృప్తి పరచుతూనే ఉంది. బ్రహ్మపుత్ర నదిపై రెండో వంతెన నిర్మాణం పూర్తయితే అరుణాచల్‌ప్రదేశ్‌కు రోడ్డు సౌకర్యాలు మరింతగా పెరుగుతాయి. చైనా ఎత్తుగడలతో ఇండియాను అదుపు చేయడానికి పాకిస్థాన్‌కు ఎల్లవేళలా సహాయా న్ని అందిస్తోంది. పాకిస్థాన్‌ సైనికపరంగా ఆదుకొంటుంది. పాక్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థలకు చైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇండియాలోని ముంబయిపై 2002/12లో ఉగ్రవాదదాడులు జరి పిన లష్కరే తోయిబా నాయకుడు హాఫీజ్‌ సయ్యద్‌ నేతృత్వం వహించగా హాఫీజ్‌ సయ్యద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రక టించమని భారత్‌ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరగా ఆ ప్రతిపాదనను చైనా వీటో చేసింది. కానీ భారత్‌ భద్రతా మండిలిని పదేపదే సయ్యద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిం చమని ప్రతిపాదనలు పెట్టగా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్సు, రష్యాలు మద్దతు నియగా చైనా తిరస్కరిస్తూ వచ్చింది. చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా శ్రద్ధ చూపడంతో లష్కరే తోయిబా టెర్రరిస్టు నేతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంపై చైనా అంగీకరించింది. ఎటు చూసినా చైనా ఇండియా ప్రయోజనాలకు ఆటంకం సృష్టిస్తూనే ఉంది. అంతేగాక ఇండియా రక్షణ శాఖ ఏదైన కొత్త మిస్సైల్‌ను ప్రయోగించితే అదే రీతిలో పాకిస్థాన్‌కు సహాయం చేస్తుంది. బాలస్టిక్‌ మిస్సైల్‌కు చైనా సహాయం అందించింది.చివరకు అమెరికా ఏకైక అగ్రరాజ్యం హెచ్చ రికలనుకానీ, వాణిజ్య సుంకపు పెంపును కానీ లెక్క చేయకుండా ఉత్తర కొరియా న్యూక్లియర్‌ బాంబుల పరీక్షలకు తోడ్పడుతూ పరోక్షంగా ఆ దేశానికి సహాయ సహకారాలను అందిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌, ఉత్తర కొరియానేత కిమ్‌ల మధ్య రెండు సమావేశాలు జరిగి అణు ఆయుధాల తగ్గింపు ఒప్పందం చేసుకున్నాయి. కానీ చైనా రష్యా అండతో ఉత్తర కొరియా రెచ్చిపోయి అణ్వాయుధాల పరీక్షలు జరిపి అమెరికానే భయపెడుతున్నది.భారత్‌ అమెరికా న్యూక్లియర్‌ ఒప్పందం దృష్ట్యా అమెరికా భారత్‌కు సహాయాన్ని అందిస్తోంది. భారత్‌ తన సరి హద్దు రాష్ట్రమైన జమ్మూకాశ్మీర్‌ ప్రత్యేకహోదాను 370,35ఎను రద్దు చేసింది.అందుకు రాజ్యాంగ సవరణను తెచ్చి తన అంతర్గత సమస్యగా భారత్‌ ప్రకటించింది. కానీ పాకిస్థాన్‌కు సహాయపడే దృష్టితో చైనా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జమ్మూకాశ్మీరు హోదాను తగ్గించి కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడం, పాకి స్థాన్‌ ఆక్రమిత కాశ్మీరులో సరిహద్దులలో కంచెను తొలగించడం, భారత్‌ పాకిస్థాన్‌పై దాడులు జరుపుతుందని చెప్పి భద్రతా మండ లిలో రహదారుల మూసివేత సమావేశం పెట్టింది చైనా. భారత్‌, చైనాలు తలపడి యుద్ధం చేస్తే న్యూక్లియర్‌ క్షిపణులు రెండింతలు పెరిగి మారణహోమానికి దారితీస్తుంది. కనుక ఇండియా, చైనాలు సంయమనం పాటించి సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి.

  • డాక్టర్‌ కె.ఆసయ్య,ఐఐఎస్‌

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/