ప్రజావాక్కు: సమస్యలపై గళం

People
voice of the people

నిర్లక్ష్యానికి గురవుతున్న గ్రామాలు:- సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా నేటికీ రహదారులు, విద్య, వైద్యం,సురక్షిత తాగునీరు లేనిగ్రామాలు దేశంలో అయిదువేల దాకా వ్ఞన్నాయన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ తాజా నివేదిక ఈ పథకాల అమలులో వైఫల్యం, నిర్లక్ష్యాలను తెలి యచేస్తోంది.ముఖ్యంగా తెలంగాణ,ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌వంటి రాష్ట్రాలలో మారుమూలఏజెన్సీగిరిజన గ్రామా లలోఅయితే కనీస మౌలికసదుపాయాలు లేకుండా అధ్వాన్నం గా బతుకుఈడుస్తున్న ప్రజలు ఎందరోఉన్నారు. ప్రభుత్వాలు ఖర్చుచేసేవేలకోట్లు ఈ గ్రామాలకు ఎందుకులభించడం లేదన్న దానిపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆత్మపరిశీలన చేసుకోవాలి.

సహ చట్టం అమలు తీరుపై అసంతృప్తి:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరు

దేశంలో సమాచార హక్కు చట్టం అమలు తీరు పట్ల సర్వో న్నతన్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేయడం సమంజసంగా వ్ఞంది. చట్టం అమలై 14 సంవత్సరాలు దాటినా ఇంకా బాలా రిష్టాలుదశలోనే ఉండడం బాధాకరం. కేంద్ర,రాష్ట్ర స్థాయిలలో సమాచార సంఘాలలో153కమిషనర్లు,చీఫ్‌ కమిషనర్ల పోస్టు లు ఖాళీగాఉండడం, వివిధస్థాయిలలో ఇప్పటివరకు 30లక్షల ఆర్టిఐ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్న వాస్తవాలు సద రుచట్టంఅమలుపైకేంద్ర,రాష్ట్రప్రభుత్వాలునిర్లక్ష్య, నిర్లిప్తపూరిత వైఖరికి నిదర్శనం. అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన సివిల్‌సర్వెంట్లనే సమా చార సంఘాలకు కమిషనర్లుగా నియమించడం వలన చట్టం పారదర్శకతతో అమలు కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడడం సమంజసంగా ఉంది.

తెలంగాణకు తీవ్ర నిరాశ: -సి.సాయిప్రతాప్‌, హైదరాబాద్‌

తాజా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి మరొ కసారి మొండిచెయ్యిచూపింది. 2014వసంవత్సరం కొత్తరాష్ట్రం గా అవతరించాక వరుసగా ఏడవసంవత్సరం కూడా తెలంగా ణా ప్రజలకు నిరాశే మిగిలింది. దాదాపుగా ముప్ఫై లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌లో ఒక్క నయాపైసా అదనంగా ఇవ్వకపోగా, పన్నుల వాటాలో భారీగా కోత విధించడం దారుణం. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుండి 16728 కోట్లు పన్నుల వాటాగా రావాల్సి ఉండగా గత రెండేళ్లుగా 20 శాతం కోతపడుతూ వస్తోంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రాష్ట్రానికి అండగా నిలవాలని రాష్ట్రప్రభుత్వం పలు దఫాలుగా చేసిన విజ్ఞప్తులు అరణ్యరోదనే అయింది.

ఎల్‌ఐసిని ప్రైవేట్‌పరం చేయరాదు:-డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

జీవిత బీమాసంస్థలో కొంత వాటాని ప్రైవేట్‌పరం చేస్తామం టూ కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించడం ఆందోళనకరం. జీవిత బీమాసంస్థ లాభాలతోవిజయవంతంగా నడుస్తోన్న పూర్తిస్థాయి ప్రభుత్వరంగ సంస్థ.1956లో నెలకొల్పిన నాటి నుండి నష్టాల పాలై ప్రభుత్వంవంక సాయంకోసం చూసినసందర్భం ఒక్కటం టే ఒక్కటి లేదు. పైగా వస్తున్న లాభాలతో ప్రభుత్వానికి డివి డెండ్లు రూపేణా, ఇతరత్రా సాయం చేస్తూనే ఉంది. మార్కెట్‌ బాగులేని ఈ ఏడాది కూడా వేలకోట్ల రూపాయల్ని డివిడెండ్‌ ఇచ్చింది. నలభై కోట్ల మంది పాలసీదారులున్నారు. ఈ ఏడాది వ్యాపారంలో 20 శాతం వృద్ధి నమోదు చేసింది. బీమా రంగం లో 72 శాతం మార్కెట్‌తో ఉంది. ప్రైవేట్‌ బీమా సంస్థలు రంగంలో ఉన్నప్పటికీ పోటీకి రాకలేకపోతున్నాయంటే దీనికి ముఖ్యకారణం సంస్థపై ప్రజల నమ్మకం.

ప్రభుత్వాన్ని కాకా పడుతున్న ఎన్జీవోలు:-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

సుమారు 70వేల ఉద్యోగఖాళీలు పూరించడం, దినసరి, ఒప్పం దం,కంటిజెంట్‌ ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించడం, నాలు గు కిస్తీల కరవ్ఞభత్యం బకాయిలు, పదకొండవ వేతన సవరణ అమలు వంటివి గాలికి వదిలి ఆంధ్రప్రదేశ్‌ ఎన్జీవో నూతన అధ్యక్షుడు ప్రభుత్వం అడగకుండానే కార్యనిర్వాహణ రాజధాని విశాఖకు ఉద్యోగులు తరలివెళ్తామని చెప్పడం ఉద్యోగ సమస్య ల కంటే ప్రభుత్వంపై ప్రేమే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. గతంలో అధ్యక్షులుగా చేసినవారు ఆంధ్రా, తెలంగాణాలలో ఎమ్మెల్సీలుగా ఆయా పార్టీ నియమించినందున ప్రస్తుత ఎన్జీవో నాయకుడు కూడా ఎమ్మెల్సీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని కాకా పడుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆంధ్రాలో మండలి రద్దుకు సిఫారసు చేసిన సంగతి గమనించాలి.

పేరుకే బడ్జెట్‌: -సయ్యద్‌ షఫీ, హనుమకొండ

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది.గణాంకాల గారడి చేసింది. అంకెలతో కాని కట్‌ చేసింది. వేతన జీవ్ఞలపై మెలిక పెట్టింది. పేరుకు మాత్రమే స్లాబుల్‌ విధానం పెంచింది. ఐదు లక్షలలోపు వ్యక్తిగతఆదాయం ఐదుశాతం పన్నులు విధించారు. కార్మికులు రైతులు ఆందోళనచేస్తూనే ఉన్నారు. విద్యాఉద్యోగాల ప్రస్తావన బడ్జెట్లో లేనేలేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. ఉద్యోగాలు నియామకాలు మాట దేవ్ఞడెరుగు. ఖాళీ ఉద్యోగాల భర్తీ కావడం లేదు. సబ్‌కాసాత్‌, సబ్‌ కా వికాస్‌ అన్నారు. కానీ ఆచరణలో మాత్రం లేరు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/