బిఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌

BSF conistables
BSF conistables

కోలకతా: కరోనా నియంత్రణకు రాష్ట్రాలు చేపడుతున్న చర్యలను పర్యవేక్షించేందుకు అంతర్‌ మంత్రిత్వ శాఖ (ఐఎంసిటి) బృందాలు పర్యటిస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్న ఐఎంసిటిలోని బిఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌కు కరోనా సోకినట్లు అధికారలు తెలిపారు. దీంతో అతనితో పాటు, అతనితో సన్నిహితంగా ఉన్న 50 మంది భధ్రతా సిబ్బందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. కరోనా సోకిన కానిస్టేబుల్‌ ఐఎంసిటి బృందంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వెంటనే అతనిని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించి, అతనితో సన్నిహితంగా మెలిగిన 50 మంది సిబ్బందిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/