ప్రస్తుతం అత్యంత ఫిట్‌గా ఉన్న క్రికెటర్ కోహ్లీ
భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్త

ముంబయి: విరాట్ కోహ్లీ భారత క్రికెట్లో అడుగుపెట్టి తన ప్రదర్శనతో, అతికొద్ది సమయంలోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన ఆట తీరుతో పాటు ఫిట్‌నెస్‌పై మరింత కసరత్తులు చేస్తు ప్రస్తుత క్రికెటర్లలో అత్యంత ఫిట్‌గా ఉన్న క్రికెటర్‌గా నిలిచాడు. ఇపుడు అతడున్న ఫిట్నెస్తో తనకు నలభై సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా క్రికెట్ ఆడొచ్చని మాజి క్రికెటర్ దీప్ దాస్‌గుప్త అన్నారు. అయితే విరాట్ ఎంత కాలం తన మనస్సుని, ప్రశాంతంగా ఉంచుకోగలడా అనే ప్రశ్న కూడా ఉందని ఆయన అన్నాడు. చాలా మంది క్రికెటర్లలో ఒక రకమైన దూకుడును చూశాను, కాని అది వారిని తొందరగా అలసిపోయేలా చేస్తుంది. విరాట్ విషయంలో అలా జరగవద్దు అని అనుకుంటున్నట్లు తెలిపాడు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/