హీరో మోటార్స్‌ ప్లాంట్లు పునఃప్రారంభం

రెండురోజుల్లో ద్విచక్రవాహనాల ఉత్పత్తి

Hero MotoCorp
Hero MotoCorp

న్యూఢిల్లీ: దేశంలో కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ ప్రకటన అనంతరం మార్చి 22 నుంచి హీరో మోటార్స్ తమ ప్లాంట్లను మూసివేసింది. దీంతో హీరో మోటార్స్ కార్పొరేషన్ కంపెనీ తన ప్లాంట్లను ఈరోజు నుండి పునర్ ప్రారంభించింది. కేంద్రప్రభుత్వ నిబంధనలను అనుసరించి గురుగ్రామ్, ధారుహెరా, హరిద్వార్, నీమ్ రానా ప్లాంట్లను సోమవారం ప్రారంభించారు. హీరో మోటార్స్ ద్విచక్రవాహనాల ఉత్పత్తి బుధవారం నుంచి ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది. అత్యవసర సిబ్బంది మాత్రమే తమ కంపెనీ ప్లాంట్లకు వచ్చి సామాజిక దూరం, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనిచేస్తారని కంపెనీ ప్రకటించింది. మిగిలిన ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా చర్యలు తీసుకున్నామని కంపెనీ వెల్లడించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/