ఫెదరర్‌ భారి విరాళం

కరోనా నివారణకు వినియోగించాలని వినతి

rojar fedarar
rojar federar

జెనీవా: కరోనా భారిన పడి పలు దేశాలు విలవిలలాడుతున్నాయి. అందులో స్విట్జర్లాండ్‌ ఒకటి. తాజా లెక్కల ప్రకారం ఇక్కడ 8,800 పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 86 మంది మరణించారు. ఈ పరిస్థితిని చూసి చలించిపోయిన ప్రముఖ స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ తన పెద్ద మనసు చాటుకున్నాడు. తనవంతుగా కరోనాపై పోరాడేందుకు 7.75 కోట్లను విరాళంగా ప్రకటించాడు. ఈ విరాళాన్ని కరోనాను అరికట్టే చర్యలకు వినియోగించాలని కోరాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/