పరీక్షలు పకడ్బందీగా జరిగేనా?

 Exam
Exam

తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ ప్రకటించారు. దీంతో విద్యార్థుల్లోనే కాదు వారి తల్లిదండ్రుల్లోనూ టెన్షన్‌ ప్రారంభమైంది. ఈసారి అయినా పరీక్షలు లీక్‌లు లేకుండా, కాపీలకు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవ్ఞతున్నాయి. పాలకులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు ఏదో ఒక రూపంలో పరీక్షాపత్రాలు బయటపడుతున్నాయి. తన,మన బేధాలు లేకుండా పక్షపాతాలకు అతీతంగా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని పాలకులు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవ్ఞతున్నాయి. అసమర్థతో, నిర్లక్ష్యమో వీటన్నింటిని మించి చట్టాల్లో ఉన్న లోపాల వల్లనో పరీక్ష నిర్వహణ అంతకంతకు దిగజారిపోతున్నది. ముఖ్యంగా ఇంటర్మీడియేట్‌ తర్వాత జరుగుతున్న ప్రవేశపరీక్షలు ఎంసెట్‌ కానీ, మరే ఇతర పరీక్షలతోపాటు ప్రస్తుతం మెడిసిన్‌ ఎంట్రన్స్‌ కోసం నిర్వహిస్తున్న నీట్‌ పరీక్షల్లో కూడా అవకతవకలు జరు గుతున్నాయనే ఆరోపణలు వెల్లుబుకుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నీట్‌ పరీక్షలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక అరమార్కు తేడాతో ఎందరో విద్యార్థుల జీవితాలు తారుమారు అవ్ఞతాయి. ప్రధానంగా వైద్యవిద్య పేద, బడుగు వర్గాలకే కాదు ఎగువ మధ్యతరగతి వారికి కూడా అందని ద్రాక్షపండుగా తయారైంది. వైద్యవిద్య వ్యాపారం దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలు గుమ్మరి స్తున్నది. ఇది ఇప్పటికిప్పుడు ప్రారంభంకాకపోయినా ఏనాటి నుంచో ఉన్నా రానురాను పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం. రకరకాల పరీక్షల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. విద్యార్థి ఎంత మానసిక ఒత్తిడికి గురవ్ఞతున్నాడో ఒక్కసారి పెద్దలు మనస్సుపెట్టి ఆలోచించాలి. ఇంజినీరింగ్‌ విద్య అంత ఇబ్బందికాకపోయినా మంచి కాలేజీల్లో ఐఐటి లాంటి సీట్లు దక్కించుకోవాలంటే ఆ విద్యార్థులు పడు తున్న కష్టం అంతాఇంతా కాదు. అందుకే ఈ పరీక్ష లన్నింటికి ప్రాధాన్యత సంతరించుకున్నది. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే ఈ పరీక్షలు ఎంత పకడ్బందీ గా నిర్వహించాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను తప్పు పట్టలేం కానీ వంద శాతం లీక్‌ ప్రూఫ్‌గా కాపీరహితంగా పరీక్షలు నిర్వహించలేకపోతున్నారనేది వాస్తవం. ఇక ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభమై నాలుగు దశాబ్దాలు దాటి పోయినా నేటికీ ఒక్క తప్పులేకుండా ప్రశ్నాపత్రాలు రూపొందించలేకపోతున్నారంటే ఎవరికి చెప్పుకోవాలి? ఏమనుకోవాలి? ఒక తప్పు ప్రశ్న జవాబు కోసం ఉన్న కొద్ది సమయంలో ఆ విద్యార్థిపడిన టెన్షన్‌కు ఎవరు జవాబుదారీ? అంత బాధ్యతారాహిత్యంగా విద్యార్థుల భవిష్యత్తులో కీలకంగా ముడిపడి ఉన్నఈ ప్రశ్నాపత్రాలు ఎందుకు రూపొందిస్తున్నారు? ఈ ప్రశ్నలకు ఏమి జవా బులు దొరకవ్ఞ. పరీక్షలు అయిపోయిన తర్వాత ఆ ప్రశ్నను తీసివేసి కరెక్షన్‌ చేస్తామని చావ్ఞకబురు చల్లాగా చెప్పినట్లు చెప్తారు. తప్పుడు ప్రశ్నలు రూపొందించిన వారిపై ఎందుకు కఠినచర్యలు తీసుకోలేకపోతున్నారు? పునరావృతం కాకుండా ఎందుకు నియంత్రించలేకపోతు న్నారు? ఇక కాపీయింగ్‌కు వస్తే చేయిదాటిపోతున్నదేమో ననిపిస్తున్నది. ప్రధానంగా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ కాపీయింగ్‌కు ఉపయోగించుకోవడం అత్యంత దుర దృష్టకరం. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ముఠాలు ఏర్పడి కాపీయింగ్‌కు తర్ఫీదు ఇచ్చి కాంట్రాక్టు కుదుర్చుకుంటు న్నారంటే పరిస్థితి ఏస్థాయికి వెళ్లిందో ఊహించుకోవచ్చు. రుజువ్ఞలతో సహా పట్టుబడిన సందర్భాల్లో నిందితులపై మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా నిర్దిష్టమైన, పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో పాలకులు విఫలమవ్ఞతున్నారు. అందుకే ఒకపక్క పట్టుబడుతున్నా జైళ్లకు వెళుతున్నా తిరిగి వచ్చి అదే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పాలకులు హైటెక్‌ కాపీయింగ్‌కు అవకాశం ఉన్న ఉంగరాలు, చెవిపోగులు లాంటివి కూడా ధరించి పరీక్షలకు హాజరుకారదని నిషేధం విధించారు.పొడుగు చేతుల చొక్కా, జెర్కిన్‌ లాంటివి ధరించినా, పెద్దగుండీలు, చివరకు బూట్లు, హైహీల్స్‌ లాంటివి వేసుకోకుండా కొన్ని పరీక్షలకు నిషేధం విధించినా ఫలితాలు ఉండటం లేదు. కంటి అద్దాల ద్వారా జరుగుతున్న హైటెక్‌ కాపీయింగ్‌ను ఆపేందుకు అన్వేషణజరిగినా ఫలితాలు లభించడం లేదు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయో గించుకొని పరీక్షల్లో ర్యాంకులు సంపాదించుకోవాలనే కొందరి విద్యార్థులను రంగంలోకిదించి కోట్లాది రూపా యలు దండుకుంటున్న దళారుల అరాచకం అంతకంతకు శృతిమించిపోతున్నది.దీంతో రాత్రింబవళ్లు కష్టపడి ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి చదువ్ఞకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఎంసెట్‌, నీట్‌ పరీక్షలే కాదు పదో తరగతి నుంచి ఆరంభమైతే ఉద్యోగా లకు జరిగే పరీక్షల్లో కూడా ప్రశ్నాపత్రాలు సంపాదించుకు నేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఒకసారి రైల్వేరిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రశ్నాపత్రా లు లీక్‌ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. చాలా వరకు మూడో కంటికి తెలియకుండా జరిగిపోతున్నాయి. ప్రశ్నాపత్రాలు లీక్‌ అయినట్లు బయటపడిన సందర్భాల్లోమాత్రం ఏవో నామమాత్రపు చర్యలతో చేతులు దులుపు కుంటున్నారు. చదివే జీవన్మరణ సమస్యగా రాత్రింబవళ్లు కృషి చేస్తున్న విద్యార్థుల భవిష్యత్తును పాలకులు దృష్టి లో ఉంచుకోవాలి. కనీసం ఈ నూతన సంవత్సరంలో జరిగే పరీక్షలైనా పకడ్బందీగా లీక్‌ఫ్రూఫ్‌గా, కాపీరహి తంగా నిర్వహిస్తారని ఆశిద్దాం. నిత్యం అధ్యయనంతో విజ్ఞానం ఆర్జించి పరిశోధనతో మేధాసంపత్తిని పెంచుకోవాల్సిన విద్యావిధానం డబ్బుతో కొనుక్కునే స్థాయికి దిగజారడం అత్యంత దురదృష్టకరం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/