దానాల్లోకన్నా రక్తదానం మిన్న

బ్లడ్‌ బ్యాంకులపై ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేయాలి

BLOOD DONATION
BLOOD DONATION

రహదారులపై రద్దీ కూడా పెరిగి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ప్రమాదాల్లో తీవ్ర రక్తస్రావం జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.

సకాలంలో రక్తం అందితే చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చు. రక్తదానం అనేదివ్యాపారంగా కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో డాక్టర్‌ జయగోపాల్‌ జెల్లీ స్వచ్ఛంద రక్తదాన ఉద్యమాన్ని మన దేశంలో ప్రారంభించారు.

ఆయన 1926 అక్టోబర్‌ 1న జన్మిం చారు. రక్తదానం ప్రాముఖ్యత ప్రజలకి వివరించేందుకు దేశ వ్యాప్తంగా పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా ఈయన ‘ది బ్లడ్‌ బ్యాంక్‌ సొసైటీ ఛండీఘర్‌ని స్థాపించారు. రక్తమార్పిడిపై వందకుపైగా వ్యాసాలు రాశారు. జెల్లీ కృషి ఫలితంగా మనదేశంలో నేషనల్‌ బ్లడ్‌ పాలసీలో స్వచ్ఛంద రక్తదానాన్ని ఒక అంశంగా చేర్చింది.

స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టినందుకు ఆయన పలు పురస్కారాలు పొందారు. లక్నో విశ్వవిద్యాలయం ఆయనకు బంగారు పతకాన్ని బహుకరించింది. ప్రతిష్టాత్మక డాII బి.సి రా§్‌ు జాతీయ అవార్డ్‌ కూడా ఆయనని వరించింది. 87 సంవత్సరాల వయస్సులో జెల్లీ 2013 అక్టోబర్‌ 5న తుది శ్వాసవిడిచారు. ఆయన ఛండీఘర్‌, లక్నో తదితర ప్రాంతాల్లో పనిచేశారు. జెల్లీని మనదేశ రక్తమార్పిడి పితామహుడుగా పరిగణిస్తారు. ఆయన జయంతిని జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవంగా మనదేశంలో జరుపుకుంటారు.

ఆయన కృషి ఫలితంగానే పలువురు నేడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారు. హిమోఫీలియో, థలసేమియా వంటి అరుదైనటువంటి వ్యాధులతో బాధపడే వారికి తగు జాగ్రత్తలతో రక్తమార్పిడి లేదా రక్తదానం చేయవలసిన అవసరం ఉందని జెల్లీ వివరించారు. ఆయన రక్తమార్పిడి అనే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి చాలా రోజులు పనిచేసారు.

రక్తదానం చేయడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవనే విషయం అందరికీ తెలిసిందే. రక్తదానం పట్ల ప్రజలలో ఎంత అవగాహన పెరిగినప్పటికీ బ్లడ్‌ బ్యాంక్‌లు ఇంకా జిల్లా తాలూకా కేంద్రాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిని మండల కేంద్రాలకు కూడా విస్తరింపచేసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు కూడా బ్లడ్‌ బ్యాంక్‌లు అందుబాటులో ఉండటానికి అవకాశాలుంటాయి.

ప్రమాదాలలో గాయపడిన వారికే కాకుండా, పలు ఇతర సంద ర్భాలలో కూడా రక్తమార్పిడి లేదా రక్తదానం అవసరమవుతుం ది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు జెల్లీ స్ఫూర్తితో స్వచ్ఛంద రక్తదానంపై పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహిం చాలి. యువకులు, విద్యార్థులు రక్తదానం చేసేందుకు వీలుగా అధికారులు ప్రోత్సహించాలి. బ్లడ్‌ బ్యాంకులపై ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. అప్పుడే రక్తదానం వ్యాపారంగా కాకుండా సామాన్యులకు అందుబాటులో ఉంటుంది.

  • ఎం. రాంప్రదీప్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/