పరిస్థితులు అదుపులోకి వచ్చాయి!

విశాఖ పోలీస్‌ కమీషనర్‌ ఆర్కే మీనా

rk meena
rk meena

విశాఖపట్నం: విశాఖ గ్యాస్‌ లీకేజ్‌ ఘటనపై వస్తున్న వదంతులను నమ్మవద్దని విశాఖ పోలీస్‌ కమీషనర్‌(సీపీ) ఆర్కే మీనా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ చుట్టుప్రక్కల రెండు కిలోమీటర్ల పరిధిలోని వారిని ఖాళీ చేయమని కోరినట్లుగా ఆయన తెలిపారు. ఈ సంస్థకు చుట్టు ప్రక్కల ఉన్నటువంటి ఐదు గ్రామాల ప్రజలు మినహా మిగతా ప్రాంతాల్లోని వారు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండాలని కోరారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, గాలిలోని పరిస్థితి, సాంద్రతను ఎప్పటికపుడు పరిశీలిస్తున్నారని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/