ఏజెంట్ వల్ల నిర్మాతలకు భారీ నష్టాలు

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో AK ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్ మూవీ భారీ నష్టాలను మిగిల్చింది. రూ.80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ భారీ చిత్రం కనీసం పది కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఫైనల్ గా 13.50 కోట్ల గ్రాస్ , ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల షేర్ రాబట్టి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇప్పటివరకు తెలుగు నిర్మాతలకు అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా ఏజెంట్ నిలిచింది. మే 19న సోని లివ్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాకి వచ్చిన డిజాస్టర్ టాక్ కారణంగా.. రిలీజైన ఇరవై రోజులకే ఓటీటీలోకి రాబోతుంది. ప్రస్తుతం అఖిల్ యువీ క్రియేషన్ బ్యానర్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నాడు.