పవన్ టైటిల్ తో ఎన్టీఆర్..?

చిత్రసీమలో ఒక హీరోకు అనుకున్న కథ..మరో హీరో చేయడం..ఓ హీరోకు అనుకున్న టైటిల్ మరో హీరో మూవీ కి పెట్టడం కామన్. తాజాగా పవన్ కళ్యాణ్ కు అనుకున్న టైటిల్ ఇప్పుడు ఎన్టీఆర్ చిత్రానికి వెళ్లినట్లు ఫిలిం సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. గత కొంతకాలంగా ‘ దేవర ‘ టైటిల్ పవన్ కళ్యాణ్ చిత్రానికే అని తెగ ప్రచారం అవుతూ వచ్చింది. పవన్ అభిమానులు సైతం ఇదే ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ టైటిల్ తో ఎన్టీఆర్ రాబోతున్నాడు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు సముద్రఖనితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ హిట్ మూవీ వినోదయ సీతమ్ కు ఇది రీమేక్. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ మూవీలో పవన్ కల్యాణ్ దేవుడిగా కనిపించనున్నాడు. అందుకే ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను పరిశీలించారు. కానీ చివరికి ఈ సినిమాకు “బ్రో” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్.

దీంతో పవర్ ఫుల్ టైటిల్ దేవర ను ఎన్టీఆర్ కోసం వాడేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమా చాలా పవర్ఫుల్ గా ఉండనుందట. అందుకే ఈ సినిమాకు దేవర టైటిల్ ఫిక్స్ చేయనున్నారట మేకర్స్.