ఉయ్యూరులో టిడిపి ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే ధర్నా

తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ టిడిపి ఆందోళన

Telugu Desam Party
Telugu Desam Party

కృష్ణా: టిడిపి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ కృష్ణా జిల్లా ఉయ్యూరులో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట పార్టీ అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో అక్రమంగా మద్యం నిలవ చేశారనే ఆరోపణలతోటిడిపి కార్యకర్త రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసుల తీరుపై టిడిపి శ్రేణులు మండిపడ్డాయి. వైఎస్‌ఆర్‌సిపి నేతల ఒత్తిడితోనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/