నటి వాణిశ్రీ కుమారుడు మృతి

ప్రకటించిన వాణిశ్రీ కుటుంబం

senior-actress-vanisri-son

చెన్నై: అలనాటి అందాల సినీ నటి వాణిశ్రీ కుమారుడు డా.అభినయ్ వెంకటేశ్ (36) కన్నుమూశాడు. ఈరోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. నిద్రలోనే తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూసినట్లు సమాచారం. నటి వాణిశ్రీకి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో డాక్టర్ గాచేస్తున్నారు. అభినయ్‌కు భార్యతో పాటు ఓ నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆయన భార్య కూడా వైద్యురాలుగా పనిచేస్తోంది. అభినయ్ గతంలో రామచంద్రన్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ పనిచేశాడు. కుమారుడు మృతి చెందడంతో  వాణిశ్రీ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.  చెన్నైలోని అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కుమార్తె ఉన్నారు. ఆయన భార్య కూడా వైద్యురాలే.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/