ఇటలీ మిలన్‌లో పార్కింగ్‌ చేసిన వాహనంలో భారీ పేలుడు

Massive explosion in Milan city, northern Italy fire

మిలన్‌: ఇటలీలో భారీ పేలుడు సంభవించింది. పార్క్ చేసిన వాహనంలో భారీ పేలుడు జరిగింది. ప్రస్తుతం భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న కార్లకు సైతం మంటలు అంటుకున్నాయి. ప్రమాద స్థలంలో దట్టంగా పొగ కమ్మివేసింది. ప్రమాదంలో ఐదారు వాహనాలు కాలిబూడిదయ్యాయి. అయితే, సిలిండర్లు తరలిస్తున్న వాహనంలో పేలుడు జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే, సంఘటనా స్థలంలోనే పాఠశాల, నర్సింగ్‌ హోం ఉండగా.. అందులో ఉన్న వారిని పోలీసులు ఖాళీ చేయించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.