ఆత్మీయమైన మాటే అనుబంధానికి రక్ష!

women
women

మన జీవితమే మన ఒక గురువు వంటిది. జీవన గమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. మానవత, భావుకత మనిషికి వస్తుశిల్పాలు, జీవితపు విలవలే మనిషికి అలంకారాలు. మనిషి తన జీవితంలో విజయం కోసం మాత్రమే కాదు, విలువల కోసం జీవించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. జీవితాన్ని కోరుకున్నట్లుగా మలచుకోవాలంటే ప్లానింగ్‌ ఉండాలి. లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని సఫలీకృతం చేయడానికి కృషి చేయాలి. అపజయాలను లెక్కచేయకూడదు. అవి సహజమే. అవి జీవన సౌందర్యాన్ని, సౌరభాన్ని పెంచుతాయి. భవిష్యత్తులో మన ఆదర్శాలను గుర్తు చేస్తాయి. నిద్రలేచింది మొదలు రాత్రి విశ్రమించేవరకు ఎదురయ్యే ఆటంకాలను మనిషి తన సామర్థ్యంతో తెలివితేటలతో అధిగమించాలి. మన స్థాయిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటుంటాం. మనం చేసిన పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. కష్టాలు మన శత్రువులు కాదు. అవి మన బలాన్ని బలహీనతల్ని బేరీజు వేసే మిత్రులు మాత్రమే. ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించాలి. విజయవంతమైన వారి వెనుక చిత్తశుద్ధి, పట్టుదల, అంకితభావం, నిజాయితీ తప్పక తోడుంటాయి. మంచితనం, మంచి వ్యక్తిత్వం పూల పరిమళంలా వీస్తుంది. ఉన్నతమైన కార్యమని దేనిని భావిస్తామో దాని సంపూర్ణంగా నెరవేర్చడం వల్ల కలిగే సంతృప్తి నిజమైన సంతృప్తి. పరిష్కరించలేని సమస్యంటూ ఏదీ ఉండదు. ఉండాల్సింది సరైన ఆలోచన, కాలాన్ని మార్పును అధ్యయనం చేసుకుంటూ సమస్యను అధిగమించే చాతుర్యం కలిగి ఉంటే జీవితాశయం తానై సాధించవచ్చ్చు. జీవితం గొప్పగా ఎదగాలంటే సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవాలి. మనకోసం చేసేది మనతోనే పోతుంది. కాని ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. బ్రతకడం వేరు జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. సంతృప్తికి చెందిన జీవించడంలో అనుభూతి ఉంటుంది. ఒదిగి ఉండటం తెలిసిన వాళ్లకే ఎలా ఆధిపత్యం చేయాలో తెలుస్తుంది. అన్ని కోల్పోయినా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. అదొక్కటే ఉంటే చాలు మనం కోల్పోయిన వాటన్నింటిని తిరిగి దక్కించుకోవచ్చు. మనల్ని గుర్తించాల్సిన అవసరం ప్రపంచానికి లేదు. మనలో ఏముందో ప్రపంచం గుర్తించేలా చేసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంది. అప్పుడే అది మనకు జోహార్లు అర్పిస్తుంది. మీరు తప్పు చేసినప్పుడు మీ తప్పును ఒప్పుకోండి. ఆ విషయంగా ప్రశ్నించినప్పుడు వివరణ ఇవ్వండి. మీకు సందేహం ఏర్పడినప్పుడు విమర్శించకండి. ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించకపోయినా ఫర్వాలేదు. కాని అపహాస్యం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. మీరు చేరే గమ్యం మార్గంలో ఎవ్వరినీ పూర్తిగా నమ్మకంగా. నిన్ను తప్ప, ఎవరి మీద ఆధారపడకండి. మీ ఆత్మవిశ్వాసంతో నడిచే సామర్ధ్యం కలిగి ఉండాలి. పగిలిన అద్దాన్ని అతికించలేని అసహాయతను తలచుకుని రోదించడం కంటె సంస్కృతి నుంచి విసిరేసిన అద్దం అందాన్ని బ్రతుకునిండా నింపుకోవడమే జీవితం. జీవితమనే వృక్షానికి కాసే పండ్లు అధికారం, సంపద అయితే ఆత్మీయులు, స్నేహితులు ఆ వృక్షానికి వేర్లు. పండ్లు లేకపోయినా ఆ చెట్టు బతుకుతుంది. కాని వేర్లు లేకపోతే బతుకలేదు. విజయం గొప్పది కాదు. సాధించిన వాడు గొప్ప. బాధపడడం గొప్ప కాదు. బాధను తట్టుకోవడం గొప్ప. బాంధవ్యాలు గొప్పకాదు. వాటిని నిలబెట్టేవాడు గొప్ప. మీ కోసం బ్రతకడంలో మీ కొక్క ఆనందం మాత్రమే ఉంటుంది. మిమ్ము ప్రేమించే వారి కోసం బ్రతకడంలో మీ జీవితమే ఉంది. మాట కంటిలో నలుసు కంటిని నలపకుండా నలుసు తీయాలి. మనిషిని బాధపెట్టకుండా మాట ఉండాలి. చెప్పవలసినవి సున్నితంగా చెప్పాలి. మనిషి మనసు అద్దంలాంటిది. దుమ్ముపడితే తుడవచ్చు. మనసు అద్దం పగిలితే ఎంత ప్రయత్నించినా అతకదు. మాట మనుషులను దగ్గరకు చేస్తుంది. అదేమాట మనిషికి దూరం చేస్తుంది. మరచిపో, క్షమించు అన్న సూత్రం మానసిక శాంతికి దివ్య ఔషదంగా పనిచేస్తుంది. మనల్ని అవమానపరచిన వ్యక్తి పట్ల, మనకు కీడు చేసిన వ్యక్తి పట్ల మన మనసులో చెడు భావం మసలుతూ ఉంటుంది. సంతోషమనేది నీకు కొనసాగించే సంబంధాల నుండో నీవు చేసే ఉద్యోగం నుండో నీ దగ్గర ఉన్న డబ్బు నుండో రాదు. అది మీ వద్ద నుండే ఉంటుంది. వేరే ఎక్కడ మీకు లభించదు. మీరు ఒకసారి ఓ ప్రయత్నం ప్రారంభించాక అది సఫలంగా ముగిసే వరకు, మీరు దాన్ని అంటిపెట్టుకుని ఉండడం చాలా అవసరం. ప్రపంచంలో అనేక పర్యాయాలు ఎంతో మందికి చేతికి అందిన అవకాశాలు చేజారిపోవడానికి కారణం వారు ఒకసారి అనేక పనులపైకి తమ దృష్టిని సారించడమే. మీరు చేయదలచిన కార్యంలో ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. ఆత్మవిశ్వాసం ఎప్పుడైనా సన్నగిల్లుతుందో అప్పటి నుండి మీ ఓటమి ప్రారంభమైనట్లే. విజయం అనేది ఎప్పుడు ముగింపు కాదు. ఓటమి అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. జీవితం కంటే గొప్ప విద్యాలయం లేదు. అందులో ప్రతి వారూ తాము కోరినంత నేర్చుకోవచ్చును. జీవితంలో ఎవరైతే కృషి పట్టుదలతో దీక్షతో ఒక లక్ష్యాన్ని చేరుకోవాలను కుంటారో వారే విజయాన్ని సాధిస్తారు. మీరు ఏది సాధించాలనుకున్నారో దాని మీద దృష్టిని కేంద్రీకరిం చండి. అది మిమ్ములను అనుకున్న స్థాయికి చేరుస్తుంది. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయాన్ని సాధించవచ్చు. వెయ్యిసార్లు ఆశయసాధనలో విఫలమైనా ఫర్వాలేదు. మరల మరల మీరు ఇంకోసారి ప్రయత్నిస్తు ఉండాలి. సాధన లేకుండా విజయాన్ని ఆశించడం, ఎడారిలో మంచినీళ్లకోసం వెదకడం వంటిది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/