ఆత్మసౌందర్యమే విలువలను పెంచుతుంది


ఓటమి లేనివాడికి అనుభవం రాదు. అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు. గెలిచినపుడు గెలుపును స్వీకరించు. ఓడినపుడు పాఠాన్ని నేర్చుకో. ఎలా నిలదొక్కుకున్నావ్ఞ అన్నది కావాలి. ఓడిపోయి, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని మననం చేసుకొంటే గెలుపు నీదే. ఆరోగ్యం పోయిన తరువాత గౌరవంగానీ, ధనంగానీ మరేదీ మనకు సంతోషాన్నీయలేవ్ఞ. కాబట్టి ఆరోగ్యవంతునికున్న సంతోషం మరెవ్వరికీ ఉండదు.

జీవితం విజ్ఞానం చేత నడవబడాలి. ప్రేమ చేత ప్రకాశింపబడాలి. అధికసంపదలో కాదు. తక్కువ కోరికల్లోనే సంతృప్తి ఉంటుంది. చేయదగ్గ పనులు మానరాదు. కూడని పనులు చేయరాదు. చేసిన చెడ్డపని తిరిగి చేయకపోవడమే నిజమైన పశ్చాత్తాపం. నీచమైన దానికోసం ఉత్తమమైన దానిని విడిచిపెడితే అది మంచిదనిపించుకోదు. అన్ని మోసాలలోను, ఆత్మవంచనే అధమాధమం. కలుషితమైన మనస్సు ఉన్న విషయాలను ఉన్నట్లుగా అర్థం చేసుకోనివ్వదు. మనస్సును ఎంత అదుపులో పెడితే మనిషి అంత గొప్పవాడవ్ఞతాడు. మనస్సును అధీనంలో తెచ్చుకున్నవాడు విశ్వవిజేత అవ్ఞతాడు. నీ పనిలో నీకు గల అభిమానమే నీ విజయానికి రహస్యం. వ్యక్తిత్వాన్ని కోల్పోయిన మనిషికి మిగిలేదేమీ లేదు. త్రికరణ శుద్ధితో శ్రమించిననాడు వ్యక్తికి అసాధ్యం కూడా సాధ్యమవ్ఞతుంది. మన తప్పులను మనం సరిదిద్దుకోవడానికి అవకాశం కావలసినంత ఉంది. మన అలవాట్లే తరచూ మన దారుణ శత్రువ్ఞలవ్ఞతాయి. మనస్సును బట్టి మన ప్రవర్తన ఉంటుంది. లోకంలో ప్రతి పనీ మానవ ప్రయత్నంపైనే ఆధారపడి ఉంటుంది. సంతోషం, సంతృప్తి అనేది మన సౌందర్యాన్ని పెంచుతుంది. మన మనసు శరీరం రెండూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
నేను, నాది, నువ్ఞ్వ, నీది అనే నాలుగు విషయాలు జీవితాన్ని పాడుచేస్తాయి. వాటిని మరచిపోవాలి. దానబుద్ధి, సత్యవాక్కు,
జీవితంలో ఒక మనిషి గెలవడానికి వంద సూత్రాలు కావాలి. అందులో అన్నిటికన్నా మొదటిది తనను తాను కరెక్ట్‌గా తెలుసుకోవడం, మిగతావి అంతగా ప్రాముఖ్యం లేనివే. లక్ష్యాన్ని మరచిపోకపోవడమే విజయానికి కీలకం. జీవితంలో ఏదీ వ్యసనంగా పరిణమించకూడదు. అదే జీవితానికి ప్రధానమంత్రం. జీవితంలో ముందడుగులు వేయాలంటే మనం మార్పుని ఆహ్వానించగలగాలి. జీవిస్తూ ఇతరులను జీవించ నీయడమే న్యాయం. సాధారణ జీవితంలో ఉన్నతాశయాలు కలిగి ఉండడమే జీవిత ధర్మం. ఎక్కువ కాలం బతకాలని కాదు. బతికిన నాలుగేళ్లు బాగా బతకాలని కోరుకోవాలి. జీవితాన్ని యౌవనంలో తెలుసుకుంటాం. వార్దక్యంలో అర్థం చేసుకుంటాం. ఆశయశుద్ధిలేని జీవితం చుక్కాని లేని నావవంటిది. జీవించినన్నాళ్లూ జీవించడం ఎలాగో నేర్చుకుంటూనే ఉండాలి. దేనికైనా అదుపూ, పొదుపూ వ్ఞంటేనే అందం.
అహింస, మితవాక్కు, ప్రియవాక్కు వంటి సద్గుణాలు అలవర్చుకోవాలి. సంవత్సరాలలో కాదు, సత్కారాలతో మనిషి జీవితాన్ని కొలవాలి.

మనోవికాసానికి జీవితం మనకు అనంతావకాశాలు కల్పిస్తుంది. ఇతరులతో సరిపోల్చుకోకుండా నీ జీవితాన్ని నీవ్ఞ జీవించు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటే సమస్యలే ఉండవ్ఞ ఎదుర్కోవడానికి. ఆదర్శం నిలుపుకోలేని మనిషి అభివృద్ధి సాధించలేడు. మితవ్యయం చేసే వివేకవంతుడే భాగ్యవంతులవ్ఞతారు. మనం ఆలోచనలోనే కాదు, ఆచరణలో కూడా ఉన్నతంగా ఉండాలి. మంచివాడవ్ఞ కావలిస్తే, ఇతరులలోని మంచిని ప్రేమించాలి. అంటీముట్టనట్లు ఉండగలగడమే అన్ని ఆనందాలకు మూలం. ప్రశాంతంగా ఉండడం అలవర్చుకోవాలి. ప్రశాం తంగా ఉండే వారిని ఎవరూ అవమానించలేరు. ఫలితాన్ని ఆశిస్తూ పరుగెత్త వద్దు. పనిచేస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. మనిషి మనసులో వినయం ఎంతగా ఎదిగితే, ఆ మనిషి జీవితంలో అంత ఎదుగుతాడు. ఒక మంచి పని చేయడానికి అసాధారణ పరిస్థితుల కోసం వేచి చూడాల్సిన పనిలేదు. మామూలు పరిస్థితుల్లోనే ఇందుకోసం ప్రయత్నించాలి. జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించడం నేర్చుకో. నీకున్న తెలివి, జ్ఞానం నీకు ఉపయోగపడలేదంటే అది నీ తప్పు కాదు. చుట్టూ ఉన్న పరిస్థితుల తప్ప నీచుట్టూ ఉన్న ఆ పరిస్థితులను మార్చుకుని అవకాశాలను సృష్టించుకోలేకపోతే, అవన్నీ వృధా అవ్ఞతాయి. మంచి మంచి ఆలోచనలే అంతరంగిక సౌందర్యానికి ప్రాణం పోస్తుంటాయి.
విజయవంతమైన ప్రతివ్యక్తి జీవితం వెనుక తోడుగా, ఎక్కడో అక్కడ అద్భుతమైన చిత్తశుద్ధి, నిజాయితీ ఉండి తీరాలి. మనం అపజయాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తే, విజయం వైపునకు దూసుకుపోగలుగుతాం. ఏదైనా అనుభవించడం కంటే ఆ అనుభవం కోసం ఎదురు చూడడంతోనే మనిషి జీవితంలో ఎక్కువభాగం గడిచిపోతుంది. ఉచితంగా దేన్నీ తీసుకోకండి. చివరికి అదే ప్రేమ అయినా సరే. దానికి మూల్యం చెల్లించు. స్పష్టమైన వస్తురూపంలోనో, భాషలోనో ఆ రుణం తీర్చేసుకో. ఉచితంగా వచ్చిన ప్రతిదానికీ నువ్ఞ్వ ఎప్పుడో, ఎక్కడో ధర చెల్లించవలసి ఉంటుంది.
కోపంతో సమాధానం చెప్పకు. సంతోషంలో వాగ్దానం చేయకు, వత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేనిచోట అబద్ధం చెప్పకు, ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడికి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండాలి. నిజం చెప్పేవాడికి వాస్తవాన్ని తట్టుకునే ధైర్యం ఉండాలి. ఓటమి లేనివాడికి అనుభవం రాదు. అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు. గెలిచినపుడు గెలుపును స్వీకరించు. ఓడినపుడు పాఠాన్ని నేర్చుకో. ఎలా నిలదొక్కుకున్నావ్ఞ అన్నది కావాలి. ఓడిపోయి, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని మననం చేసుకొంటే గెలుపు నీదే. ఆరోగ్యం పోయిన తరువాత గౌరవంగానీ, ధనంగానీ మరేదీ మనకు సంతోషాన్నీయలేవ్ఞ. కాబట్టి ఆరోగ్యవంతునికున్న సంతోషం మరెవ్వరికీ ఉండదు. మనోవాంఛను మించిన వ్యాధి మనిషికి లేనేలేదు. మంచితో శత్రువ్ఞలను క్షమించు. వారు ఎంత మంచి మిత్రులవ్ఞతారో చూడండి. జీవితంలో విజయాలకు చాలా ఉపాయాలు ఉన్నాయి. కానీ మనం పనిచెయ్యనిదే అవి పనిచెయ్యవ్ఞ. మంచితనం మనిషి సౌందర్యాన్ని ఎన్నో రెట్టు పెంచుతుంది. ఇతరులు విమర్శిస్తున్నప్పుడు నువ్ఞ్వ ఆలోచించు. ఇతరులు నిద్రిస్తున్నప్పుడు నువ్ఞ్వప్రణాళిక చెయ్యి. ఇతరులు మాట్లాడుతున్న ప్పుడు నువ్ఞ్వ విను. ఇతరులు వాయిదా వేస్తున్నప్పుడు నువ్ఞ్వ పనిచెయ్యి. ఒక సమాజం దాని నైతిక విలువలు కోల్పోతే అది సర్వస్వం కోల్పోయినట్లే. తప్పుడు నిర్ణయాల మూలంగా అనుభవాలు, అవి నేర్పిన పాఠాల ద్వారా మంచి నిర్ణయాలు, వాటి వల్ల విజయాలు సాధ్యమవ్ఞతాయి. కాలమే జీవితం కాలాన్ని వృధా చేయడమనేది జీవితాన్ని వృధా చేయడమే. మౌనంలో మహత్తర విషయాలు రూపం పొందుతుంది. బంగారంలో ప్రతి సన్నని తీగకు విలువవ్ఞన్నట్లు జీవితంలో ప్రతిక్షణానికి విలువ ఉంది.గంట జీవి తాన్ని వ్యర్థం చేసే వ్యక్తి జీవిత విలువలను అర్థం చేసుకున్న వాడు కాదు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/