జొమాటోతో విలీనమయ్యిన ఉబెర్‌ ఈట్స్‌

Zomato Acquires Uber Eats
Zomato Acquires Uber Eats

ముంబయి: భారతీయ ఆహార సరఫరా దిగ్గజం జొమాటో, అమెరికన్‌ ఆన్‌లైన్‌ ఆహార సంస్థ ఉబెర్‌ ఈట్స్‌ను చేజిక్కుంచుకుంది. ఈ మేరకే ఆ రెండు సంస్థలు దాదాపు రూ.2500 కోట్ల విలువైన వ్యాపార ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం ఉబెర్‌ ఈట్స్‌ జొమాటోతో విలీనమయ్యింది. అందుకు ప్రతిగా ఉబెర్‌కు జొమాటోలో 9.9 శాతం వాటా లభించింది. అంతేకాకుండా ఉబెర్‌ ఈట్స్‌ వినియోగదారులందరనీ జొమాటోకు బదలయించారు. అయితే ఉబెర్‌ ఈట్స్‌ ఉద్యోగులను మాత్రం జొమాటో స్వీకరించదట. భారత్‌లో పనిచేస్తున్న 100 మంది ఎగ్జిక్యూటివ్‌లకు పదవీ విరమణ ఇవ్వడంగానీ, లేదా వేరే విభాగాలకు మళ్లిస్తారు. భారత్‌లో మా ఆహార సామ్రాజ్యాన్ని స్థాపించి దానిని 500 పైగా నగరాలకు విస్తరించినందుకు గర్విస్తున్నాం. మా తాజా కొనుగోలుతో ఆహార సరఫరా రంగంలో మా స్థానం మరింత బలోపేతం కానుందని జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ ప్రకటించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/