రైలు ప్రయాణికులపై అదనపు భారం

భారీగా పెరగనున్న టికెట్ ధర

train
train

న్యూఢిల్లీ: రైలు చార్జీలను పెంచేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. అయితే, ఇది అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులకు మాత్రమే పరిమితం కానుంది. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి ఈ పెరుగుదల ఉంటుంది. అంటే ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులపై గరిష్ఠంగా రూ. 35 వరకు పెంపు ఉండగా, కనిష్ఠంగా పది రూపాయల వరకు వినియోగ రుసుమును వసూలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను రైల్వే శాఖ త్వరలో పంపనున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/