వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రాజీనామా

వెంకటేశ్ ను పక్కన పెట్టేసిన మంత్రి దాడిశెట్టి

ysrcp-state-youth-leader-mothukuri-venkatesh-resigns

అమరావతిః తుని నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సిపికి భారీ షాక్ తగిలింది. రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్‌ఆర్‌సిపిని స్థాపించినప్పటి నుంచి వెంకటేశ్ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. మంత్రి దాడిశెట్టి రాజాకు అన్నీ తానై వ్యవహరిస్తూ ఆయన విజయంలో కీలక పాత్రను పోషించారు. అయితే రాజా మంత్రి అయ్యాక వెంకటేశ్ ను పక్కన పెట్టారు. ఈ క్రమంలో తీవ్ర అసంతృప్తికి గురైన వెంకటేశ్ కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా వైఎస్‌ఆర్‌సిపికి గుడ్ బై చెప్పేశారు. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంలో క్లారిటీ లేదు.