నేడు అనంతబాబును కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు

ఈరోజుతో ముగియనున్న రిమాండ్ గడువు

అమరావతి : దళిత యువకుడు, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నారు. ఈరోజుతో ఆయనకు కోర్టు విధించిన రిమాండ్ గడువు ముగుస్తోంది. దీంతో, ఈరోజు ఆయనను కోర్టులో పోలీసులు హాజరు పరుచనున్నారు. రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ కోర్టుకు ఆయన హాజరుకానున్నారు. ఈరోజు జరిగే విచారణలో కోర్టు ఆయన రిమాండ్ ను పొడిగిస్తుందా? లేక బెయిల్ ఇస్తుందా? అనే విషయం తేలనుంది. మరోవైపు అనంతబాబుకు కఠిన శిక్ష విధించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/