పవన్ – చంద్రబాబు లకు పెద్ద షాక్ ఇచ్చిన వైస్సార్సీపీ సర్కార్

జనసేన , టీడీపీ పార్టీలకు భారీ షాక్ ఇచ్చారు వైస్సార్సీపీ సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు జోరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. సభలు , ర్యాలీ వంటివి చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సభల్లో అపశృతి చోటుచేసుకుంది. మొన్న కందుకూరు లో ఏర్పాటు చేసిన సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించగా..గుంటూరు లో జరిగిన సభలోనే అదే జరిగింది. చంద్రన్న చీరల పంపిణి లో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు కన్నుమూశారు. ఇలా రెండు చోట్ల తొక్కిసలాటలు జరగడం తో పలువురు మరణించడం తో..ఏపీ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రజల భద్రత దృష్ట్యా..ఇకపై రోడ్లపై సభలు, ర్యాలీలని నిషేదిస్తున్నట్లు రాష్ట్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే సభలు పెట్టుకోవాలని సూచించింది. ఈ నియమాలని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులపై, అలాగే మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని తెలిపింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఖచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వచ్చని మినహాయింపు ఇచ్చింది. ఇక ఇలా రూల్ పెట్టడంతో ఇకపై చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయి.

అదే సమయంలో త్వరలోనే నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. అటు పవన్ బస్సు యాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ నిర్ణయం వల్ల..ఇప్పుడు వారికి చెక్ పెట్టినట్లు అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.