వైఎస్ఆర్సిపి నుంచి రాజ్యసభ అభ్యర్థులు వీరే

అమరావతి: ఏపి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రస్తుతం ఏపిలో మంత్రులుగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ లను, రాజ్యసభకు పంపేందుకు నిర్ణయించింది. మరో ఇద్దరి విషయానికొస్తే … ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానికి, రాంకీ సంస్థ అధినేత అయోధ్య రామిరెడ్డికి కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపిలో శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను వీరిని రాజ్యసభకు పంపుతున్నట్లు కీలక సమాచారం.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business