మరికాసేపట్లో వైఎస్‌ఆర్ సంస్మరణ సభ..

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్‌ఆర్‌‌ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హైదరాబాద్ లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఏ ఏ నేతలు వస్తారో అని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. వైఎస్‌తో సన్నిహితంగా మెలిగినవారు, ఆయన హయాంలో మంత్రిమండలిలోనూ, కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన వారిని విజయమ్మ ఆహ్వానించారు.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి తదితర నేతలకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తుంది. కానీ వీరు వస్తారా రారా అనేది చూడాలి. ఇక కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ కు నివాళి కార్యక్రమానికి జగన్, షర్మిల హాజరయ్యారు. అయితే అన్నా , చెల్లెళ్లు ఎక్కడం కూడా కనీసం పలకరించకోలేదు. ఇదే కార్యక్రమానికి విజయమ్మ కూడా హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం ఇదే ఇడుపులపాయలో జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమానికి విడివిడిగా వెళ్లారు జగన్, షర్మిల. ఇవాల్టి వర్థంతి కార్యక్రమంలో ఇద్దరు నేతలు ఒకే సమయంలో హాజరైనా అక్కడ ఎలాంటి పలకరింపులు లేవు. ఆ తర్వాత షర్మిల తన ట్విట్టర్ లో ఒంటరి దానినైనా విజయం సాధించాలని.. అవమానాలెదురైనా ఎదురీదాలని.. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని.. ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ & మిస్ యూ డాడీ’ అని షర్మిల ట్వీట్ చేశారు. అంటే.. తాను ఒంటరిని అయ్యానని ఈ ట్వీట్ రూపంలో వైఎస్ షర్మిల చెప్పినట్లు అర్ధమవుతుంది. మరి ఈ క్రమంలో వైసీపీ నేతలు విజయమ్మ సభ కు వస్తారా అనేది సందేహంగా మారింది.

మరోవైపు తెలంగాణలోని టీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల్లో ఉన్న (గతంలో వైఎస్‌తో పనిచేసినవారు) వారిని సుమారు 350 మంది వరకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఈరోజు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూమిపూజ ఉండటంతో చాలామంది నాయకులు అక్కడికి బుధవారమే చేరుకున్నారు. దీంతో టీఆర్ఎస్ నుంచి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరి ఈ సభ కు ఎవరెవరు వస్తారు అనేది కాసేపైతే తెలుస్తుంది.