‘తాలిబన్ల తాతల్లా వైసీపీబన్లు..’ అంటూ జగన్ సర్కార్ ఫై నారా లోకేష్ సెటెర్లు

తెలుగుదేశం నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ..మరోసారి జగన్ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడిన లోకేష్.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నాటు తుపాకులు అమ్ముతూ నిందితుడు పోలీసులకు పట్టుబడటంతో ఏఎన్ఐ వార్తా సంస్థ చేసిన ట్వీట్‌ను షేర్ చేశారు.
‘‘తాలిబన్ల తాతల్లా తయారయ్యారు వైకాపాబన్లు.. వాళ్లు ఓపీయం (నల్లమందు) ఒక్కటే పండిస్తారు. వైకాపాబన్ల పాలనలో వాలంటీర్ వాసు సారా తయారీ నుంచి మొదలై, నేడు నాటు తుపాకుల తయారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేసారు.. చంద్రబాబు నెలకొల్పిన మెడ్‌టెక్ జోన్లో కరోనా కిట్లు మేక్ ఇన్ ఆంధ్రా అయితే జగన్ విధ్వంసక పాలనలో ఫ్యాక్షన్ కిట్లు మేడ్ ఇన్ ఆంధ్రా అయ్యాయి’ అంటూ లోకేష్ సెటెర్లు వేశారు.
తాలిబన్ల తాతల్లా తయారయ్యారు వైకాపాబన్లు. వాళ్లు ఓపీయం (నల్లమందు) ఒక్కటే పండిస్తారు. వైకాపాబన్ల పాలనలో వాలంటీర్ వాసు సారా తయారీ నుంచి మొదలై, నేడు నాటు తుపాకుల తయారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేసారు.(1/2) https://t.co/esIHjXlUAM— Lokesh Nara (@naralokesh) September 2, 2021