40 ఏళ్లుగా నిద్ర పోని మహిళ..ఎక్కడంటే

ఎవరైనా ఒకటి , రెండు రోజులు నిద్ర పోకుండా ఉంటారు. మరుసటి రోజు ఫుల్ గా నిద్ర పోతారు. అలాంటిది ఈ మహిళ మాత్రం ఒకటి , రెండు కాదు ఏకంగా 40 ఏళ్లుగా నిద్ర పోవడం లేదు. ఇలాంటి దారుణమైన జబ్బుతో ఆమె బాధపడుతుంది. ఏ హాస్పటల్ కు తీసుకెళ్లిన కానీ ఆ జబ్బు తగ్గడం లేదట. ఇంతకీ ఈ మహిళ ఎక్కడ ఉంటుందా అనుకుంటున్నారా చైనా లో ఈమె ఉంటుంది. ఈమె పేరు జ్యానింగ్.

గత నలభై సంవత్సరాల నుంచి నిద్రలేమి సమస్యతో బాధపడుతోంది. ఈ వింత జబ్బు ఆమెను ఒక్క సెకండ్ కూడా నిద్రపోనివ్వడం లేదు. చిన్నప్పుడు తప్ప గత నలభై సంవత్సరాల నుంచి ఏనాడు ఆ మహిళ నిద్ర
పోలేదట. ఆమెకు వివాహమై… దాదాపు 25 సంవత్సరాలు పూర్తయింది. వివాహమైనప్పటికీ ఆమె నిద్రపోకుండా ఉంటుంది. దీంతో ఆమె భర్త.. ఎంతో మంది వైద్యులను మరియు ఆసుపత్రులు తిరిగినా… ప్రయోజనం జరగలేదు. ఈ వింత వ్యాధి ఎవరికి చూపించినా… తనకు అర్థం కావడం లేదని వైద్యులు చెపుతున్నారట. దీంతో ఆమె భర్త కూడా ఏమీ చేయలేక ఉండిపోతున్నాడు.