బాబు , లోకేష్ ల ఫై నాని ఫైర్..తుప్పు , పప్పు అంటూ ఎద్దేవా

ప్రస్తుతం ఏపీలో వినాయక లొల్లి నడుస్తుంది. కరోనా నేపథ్యంలో ఇళ్లల్లోనే గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని ప్రభుత్వ ఆదేశాలను బిజెపి , తెలుగుదేశం పార్టీలు తప్పు పడుతున్నాయి. మద్యం షాపులకు, స్కూళ్ళు తెరవడానికి , పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, వర్ధంతులు, వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడానికి లేని కరోనా వినాయక చవితి నిర్వహించుకోవడానికి అడ్డం వస్తుందా అంటూ ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలు వెనక్కు తీసుకోవాలని , వెనక్కు తీసుకున్న తీసుకోకపోయినా వినాయక నవరాత్రులు జరిపి తీరుతామని బిజెపి శ్రేణులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఈ ఇష్యూ ఫై స్పందించారు. వినాయక చవితి పండుగ పై టీడీపీ, బీజేపీ నేతలు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని .. దేశమంతా వినాయక చవితికి ఏ నిబంధనలు ఉన్నాయో రాష్ట్రంలో అవే నిబంధనలు ఉన్నాయని నాని అన్నారు. కావాలని ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో అడ్రస్ లేని బీజేపీ కూడా రాజకీయ చేస్తుందని..సోము వీర్రాజు కి విగ్రహాలతోనూ , వినాయకచవితి తోనూ రాజకీయం చేయడం అలవాటు అంటూ విమర్శించారు. అక్కడితో ఆగకుండా తుప్పు చంద్రబాబు, పప్పు లోకేష్ అంటూ వారిని ఎద్దేవా చేసారు.