అదరగొట్టిన వైల్డ్ డాగ్.. నెట్‌ఫ్లిక్‌కు పండగే!

అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సోలోమాన్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సె్స్ అయ్యింది. పూర్తి కాప్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రావడంతో ఇందులో నాగ్ పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీలో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో వైల్డ్ డాగ్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకుల నుండి బ్రహ్మాండమైన రెస్పాన్స్ లభించింది. హైదరాబాద్‌లో జరిగిన జంట పేళ్లుల్ల నేపథ్యంలో సాగే ఈ కథలో నాగార్జున ఓ NIA ఆఫీసర్ పాత్రలో నటించారు. పాన్ ఇండియా సబ్జెక్టుతో వచ్చిన ఈ సినిమాకు థియేటర్ ప్రేక్షకులు అనుకున్న స్థాయిలో ఆదరణ చూపించలేకపోయారు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో వీక్షించేవారి సంఖ్య బాగా పెరిగింది.

మొత్తానికి థియేటర్లలో తక్కువ మంది చూసినా వైల్డ్ డాగ్ చిత్రానికి ఓటీటీ ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉండటంతో ఈ సినిమాను చూసే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. వైల్డ్ డాగ్ చిత్రంలో నాగ్‌తో పాటు బిగ్‌బాస్ ఫేం అలీ రెజా, దియా మీర్జా, సయ్యామీ ఖేర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.