నవంబర్‌ 15 నుండి సెట్స్ పైకి ‘భోళా శంకర్‌’..

నవంబర్‌ 15 నుండి సెట్స్ పైకి 'భోళా శంకర్‌'..

మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో తమిళ్ మూవీ వేదాళం తెలుగు లో ‘భోళా శంకర్‌’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టిన రోజు సందర్భాంగా ఈ మూవీ ప్రకటన వచ్చింది. అయితే గత కొద్దీ రోజులుగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడిందనే వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

నవంబర్‌ 11న ఈ మూవీని ప్రారంభం కానుందని, నవంబర్‌ 15 నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు తాజాగా మేకర్స్‌ స్పష్టం చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో చిరంజీవి విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. అలాగే ఇందులో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్‌ నటించనుంది.

ప్రస్తుతం చిరు ఆచార్య మూవీ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయనకు జోడిగా పూజా హగ్దే నటిస్తుండగా..చిరు కు జోడిగా కాజల్ నటిస్తుంది. ఫిబ్రవరి 04 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.