శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి..

శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి..
senior-choreographer-shivashankar-master-dies-of-corona

కరోనా తో పోరాడి మృతి చెందిన శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. రీసెంట్ గా కరోనా బారినపడిన శివశంకర్ హైదరాబాద్ లోని ఓ ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ వచ్చారు. అయినప్పటికీ ఆ మహమ్మారి నుండి బయటపడలేకపోయారు. ఆదివారం కన్నుమూశారు. శివ శంకర్ మరణ వార్త యావత్ చిత్ర సీమను షాక్ కు గురి చేసింది. శివ శంకర్ కు సినీ , రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలిపారు.

సోమవారం కుటుంబ సభ్యులు శివశంకర్ మాస్టర్ భౌతికకాయానికి ఫిల్మ్​నగర్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయన చిన్నకుమారుడు అజయ్ తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మరోవైపు శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ కరోనాతో పోరాడుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో మాస్టర్ మొత్తం 800 చిత్రాలలో కొన్ని వేల పాటలకి డ్యాన్స్ కంపోజ్ చేశారు.ఎంతో మంది స్టార్ హీరోలు మాస్టర్ డ్యాన్స్ లతో మంచి పేరు తెచ్చుకున్నవారే. శివ శంకర్ మాస్టర్ తన జీవిత కాలంలో కొన్నికోట్ల పైనే సంపాదించి ఉంటారు. కానీ., చివరి రోజుల్లో ఆర్ధికంగా చితికిపోయారు.

హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ కావడంతో వైద్యానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మాస్టర్ డ్యాన్సర్ గా బిజీగా ఉన్న సమయంలో ఆయనకి అస్సలు సమయం ఉండేది కాదు.కానీ., సినిమాల్లో రాను రాను క్లాసికల్ సాంగ్స్ అవసరం తగ్గిపోయింది. ఇదే సమయంలో మాస్టర్ కి వయసు అయిపోతూ వచ్చింది.ఈ కారణంగా మాస్టర్ డ్యాన్స్ కి దూరం అయిపోయారు.కానీ , బుల్లితెరపై డ్యాన్స్ షోలకి జడ్జ్ గా వచ్చి పేరు సంపాదించుకున్నారు. కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా మెరిశారు.