వకీల్ సాబ్ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇటీవల బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తనదైన రీతిలో తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాతో పవన్ మూడేళ్ల గ్యాప్ తరువాత వెండితెరపై కనిపించడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు బారులు తీరారు.

కాగా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను 50 రోజుల తరువాతే ఓటీటీలో రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాలు అంటున్నాయి. కానీ ఈ సినిమాను అనుకున్న సమయానికంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టిందని, దీంతో ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్‌తో సంప్రదింపులు కూడా జరిగినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి పవన్ అభిమానులకు వకీల్ సాబ్ చిత్రం మరోసారి అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతుందని ప్రేక్షకులు అంటున్నారు. మరి వకీల్ సాబ్ చిత్రం ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది చూడాలి అంటున్నారు సినీ ప్రేమికులు.