మే 03 న సీఎం జగన్ విశాఖ పర్యటన షెడ్యూల్ ఫిక్స్

మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ఖరారైంది. మే 3 ఉదయం 9:30గంటలకు భోగాపురం మండలం ఏ. రావివలసకు సీఎం జగన్ చేరుకుంటారు.

ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసి, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత విశాఖ చేరుకోనున్న సీఎం ఐటీ హిల్ 4 వద్ద ఆదానీ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ శంకుస్థాపనలో పాల్గొంటారు.