ప్రజావాక్కు

స్థానిక సమస్యలపై గళం

School Children in Rural Areas
School Children in Rural Areas

గ్రామీణ ప్రాంత విద్యార్థుల తంటాలు :-ముంజాల రమేశ్‌గౌడ్‌, కుందనపల్లి, భూపాలపల్లిజిల్లా

కరోనా విపత్తుతో పాఠశాలలు మూతపడగా ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు దూరమయ్యారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు తెరలేపింది.

అయితే ఆన్‌లైన్‌ పాఠాల ను అందిపుచ్చుకోవడానికి విద్యార్థులు నానా ఇబ్బందులుపడు తున్నారు.

స్మార్ట్‌ఫోన్లు, టివీలు, అంతర్జాల లేమితో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతపిల్లలు ఆన్‌లైన్‌పాఠాలకు దూరమవుతున్నారు.

ఏకపక్షంగా సాగే బోధనతో పాఠాలు అర్థంకాకపోవడం, సందే హాలు తీర్చేవారు లేకపోవడం తదితర కారణాలతో ఆన్‌లైన్‌ పాఠాలపై నిరాసక్తత కనబర్చుతున్నారు. సెల్‌ఫోన్‌, టివి, ల్యాప్‌ట్యాప్‌వంటివి కొనుక్కునే ఆర్థికస్థోమత లేక అనేక మంది చదువ్ఞలకు దూరమవుతున్నారు.

అంతకుముందు డిజిటల్‌, సాంకేతికతకు అలవడిన చిన్నారులు మినహా చాలా మంది ఆన్‌లైన్‌ పాఠాలను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా వెనుకబడిపోతున్నారు.

అనేక గ్రామాల్లో విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు పక్కనపెట్టి ఇంటిపనులు, వ్యవసాయ, ఇతర కూలీ పనుల్లో నిమగ్నమవుతున్నారు.

వరి కొయ్యలను కాల్చడంతో భూసారానికి ముప్పు: -రఘుపతిరావు గడప, రుద్రంగి, రాజన్నసిరిసిల్ల

కొన్నేళ్ల కిందటివరకు వరికోతలు కూలీలతో కోయించి అనంత రం వరికట్టలను గడ్డిమోపుగా చేసి పశువులకు మేతగా ఆ గడ్డిని వేసేవారు.కానీ నేడది కనబడడం లేదు.

ప్రస్తుతం కూలీ ల కొరత ఉండడం తక్కువ కాలంలో కోత పూర్తి చేసుకోవాలని భావించి రైతన్న యంత్రాల సహాయంతో వరికోతను పూర్తి చేస్తున్నాడు.

యంత్రాలతో వరికోస్తే వరిగడ్డిసగం వరకు కొయ్య లకు ఉంటుంది. ఆ కొయ్యలకు ఉన్న గడ్డిని తీయలేక రైతులు పొలంలోనే నిప్పుపెడుతున్నారు.

అయితే ఇలా చేయడం వల్ల భూసారం తగ్గి తర్వాత సంవత్సరం అనుకున్నంత దిగుబడి రావడం లేదు. రైతులు అవగాహన లేక ఇలా చేస్తున్నారు.

ధూమపానాన్ని నిషేధించాలి:-షేక్‌అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ఇప్పటికీ చాలా మంది బహిరంగ ధూమపానం చేస్తున్నారు.

పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని ఒకవైపు చెబుతున్నప్పటికీ చాలా మంది ధూమపానం చేస్తూ పక్కవారికి సైతం ఇబ్బంది కలిగిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం బహిరంగ ధూమ పానం చేయరాదని గతంలో చట్టం తీసుకొని వచ్చినప్పటికీ ఆ చట్టాన్నితుంగలోతొక్కి యధేచ్ఛగా ధూమపానం చేస్తున్నారు.

బహిరంగ ధూమపానం చేసేవారిని పోలీసులు కఠినంగా శిక్షించాలి. చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి.

మత్తులో యువత చిత్తు:-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

దేశంలో మత్తుపదార్థాల విక్రయం జోరుగా సాగుతుంది. విద్యా ర్థుల నుండి వృద్ధుల వరకూ బానిసలై సమాజానికి చేటు చేస్తు న్నారు.

వందల కిలోల గంజాయి, గుడుంబా, గుట్కా, ఖైనీ, డ్రమ్ములకొద్దీనాటు,కాపుసారా జాతీయ రహదారులపై యధేచ్ఛ గా తరలిపోతున్నా మామూళ్ల మత్తులో అడ్డుకునే సిబ్బంది లేకపోవడంతో మందు ప్రియులకు ఆడింది ఆట పాడింది పాట జోగుతున్నారు.

అక్రమ సంపాదనకై కళాశాలలు, విశ్వవిద్యాల యాలపై దృష్టి కేంద్రీకరించడంతో మంచీ,చెడూ తెలియని అమాయక విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

పెద్దలకు తెలిసిపోతుందేమోననే భయంతో అర్థాంతరంగా తను వ్ఞ చాలించేందుకూ వెనుకాడటం లేదు. తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారు.

మత్తు పదార్థాల తయారీ, రవాణాపై ఉక్కుపాదం మోపకపోతే భావితరాల భవిత కైలాసభూమిలో అంతరించిపోయే ప్రమాదముంది.

ప్రాజెక్టును పూర్తిచేయాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

కడప,చిత్తూరు, నెల్లూరు జిల్లాల సాగునీటి తాగునీటి అవసరాలు తీర్చే గాలేరు, నగరి ప్రాజెక్టును 2010లోనే రాష్ట్ర ప్రభు త్వం ఆమోదించినా ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడం బాధాకరం.

శ్రీశైలం రిజర్వాయర్‌ నుండి 38 టిఎంసిల కృష్ణావరద జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా చిత్తూరు జిల్లాలోనే నగరివరకు మళ్లించి, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో మూడులక్షల ఎకరాలకు సాగునీరు, ఐదులక్షల మందికి తాగునీరు అందించేవిధంగా రూపకల్పన జరిగి, కేంద్రప్రభుత్వం ఆమోదం కూడా పొందిన సదరు ప్రాజెక్టును రెండు ఫేజ్‌లలో పూర్తి చేయాలన్న లక్ష్యం నీరుగారిపోయింది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తక్షణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.

కొవిడ్‌ టీకాను అందరికి అందించాలి: – సిి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

దేశంలో ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో ప్రజలలో కాస్త ఊరట లభించింది. అయితే దీపావళి పండుగ తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులలో కొవిడ్‌ కేసులు భారీగా పెరగడం చూస్తుంటే కరోనా మహమ్మారి ఇప్పట్లో తగ్గేలా లేదని అర్థమవుతోంది.

ఢిల్లీలో స్వైరవిహారం చేస్తున్న కొవిడ్‌ రెండోవ లేక మూడవ దశ అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

జ నవరి నాటికి మలిదశ కరోనా ప్రారంభమవుతుందని మీడియాలో వస్తున్న కథనాలపై ప్రజలు భయకంపితులవుతున్నారు. అన్ని రాష్ట్రాలు కరోనానివారణకు ముందస్తుచర్యలకు ఉపక్రమించాలి.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/