మున్సిపాలిటీలకు పుష్కలంగా నిధులు మంజూరు

బాధ్యతరాహిత్యంగా ఉంటే పదవులు పోవడం ఖాయం

harish rao
harish rao

సంగారెడ్డి: కొత్త మున్సిపల్‌ చట్ట ప్రకారం ప్రతి మున్సిపాలిటీకి పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నామని మంత్రి హరీష్‌ రావు అన్నారు. కలెక్టర్ల సమక్షంలోనే బడ్జెట్‌ ప్లానింగ్‌ రూపకల్పన జరుగుతుందన్నారు. పఠాన్‌చెరు నియోజకవర్గంలోని జీఎంఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఉమ్మడి మెదక్‌ జిల్లాల పట్టణ ప్రగతి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌ రావు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లాల కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో అవినీతి, లంచగొండితనం లేని పాలనను అందించాలని తెలిపారు. బాధ్యతరాహిత్యంగా ఉంటే పదవులు పోవడం ఖాయం అని మంత్రి హెచ్చరించారు. మున్సిపాలిటీ ఆదాయంలో పది శాతం మొక్కల పెంపకానికే ఖర్చు చేయాలన్నారు. ప్లాస్టిక్‌ రహిత తెలంగాణను నిర్మించుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/