ట్రంప్‌ భారత్‌ పర్యటన..యాంటీ – డ్రోన్ సిస్టమ్

స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వ్యవస్థను వాడనున్న భారత్

trump-Anti-Drone System
trump-Anti-Drone System

గుజరాత్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ భారత పర్యటన నేపథ్యంలో భారత్‌ భద్రతలో నిమగ్నమైంది. ఈసందర్భంగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన యాంటీ-డ్రోన్ సిస్టమ్ ను ఉపయోగించనున్నారు. రెండు రోజుల పాటు మన దేశంలో ఉన్న ట్రంప్ భద్రత కోసం దాదాపు అన్ని సెక్యురిటీ ఏజెన్సీలు పని చేయనున్నాయి. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, పారా మిలటరీ దళాలు భద్రతలో నిమగ్నం కానున్నాయి. అయితే, ఉగ్రవాద సంస్థలు ఈ మధ్య డ్రోన్ దాడులు చేస్తుండడంతో వాటిని తిప్పికొట్టేందుకు డీఆర్డీఓ అభివృద్ధి చేసిన యాంటీజడ్రోన్ సిస్టమ్ ను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అహ్మదాబాద్‌ లో ట్రంప్ జమోదీ రోడ్ షోలో ఈ డ్రోన్ సిస్టమ్ ను ఉపయోగించి గగనతలంలోకి మరే డ్రోన్ లు రాకుండా నిరోధిస్తామని గుజరాత్ పోలీసులు చెబుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/