బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరనున్న వివేక్..సాయంత్రం రాహుల్ తో భేటి

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం

vivek venkataswamy who will leave BJP and join Congress

న్యూఢిల్లీః మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ సాయంత్రం ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారు. అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో రాత్రి కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం. గత శనివారం రాత్రి పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో వివేక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పెండింగ్ జాబితాను విడుదల చేయనుంది.