విష్ణు ‘మా’ ప్యానెల్ సభ్యులు వీరే..

విష్ణు 'మా' ప్యానెల్ సభ్యులు వీరే..

అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబదించిన నోటిఫికేషన్ రీసెంట్ గా విడుదలైంది. ఈ ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు ల మధ్య పోటీ నెలకొని ఉంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను పరిచయం చేసి ప్రచారం చేస్తుండగా..ఈరోజు మంచు విష్ణు సైతం తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు.

మంచు విష్ణు ప్యానెల్ లో జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్ ను ఇదివరకే ప్రకటించగా.. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్స్ గా మాదాల రవి, పృధ్విరాజ్, ట్రెజరర్ గా శివబాలాజీ, జాయింట్ సెక్రటరీస్ గా కరాటే కళ్యాణి, గౌతమ్ రాజు.. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరనాథ్ బాబు, జయవాణి, మలక్ పేట శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖ, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, పి.శ్రీనివాసులు, స్వప్న మాధురి, విష్ణు బొప్పన,వడ్లపట్ల యమ్.ఆర్.సి పేర్లను ప్రకటించారు.

అక్టోబర్ 10వ తేదీన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.